మహేష్ కత్తిపై గుడ్లతో దాడి: నిజమా, నాటకమా?

Recommended Video

    మహేష్ కత్తిపై గుడ్లతో దాడి

    హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై జరిగిందని చెబుతున్న దాడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు తనపై కోడిగుడ్లతో దాడి చేశారని మహేష్ కత్త ఆరోపిస్తున్నారు.

    అయితే, మహేష్ కత్తి ఆరోపణలపై నెటిజన్లు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మహేష్ కత్తి ఆరోపణల్లో నిజం లేదని వాదిస్తున్నారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడానికి లాజిక్‌లు లాగుతు్నారు.

     ట్రాఫిక్ అసలే ఉండదు...

    ట్రాఫిక్ అసలే ఉండదు...

    రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఉండదని, అటువంటప్పుడు టర్నింగ్ తసుకుంటూ డ్రైవర్ కారు అద్దాన్ని దించి వెనుక వస్తున్న వాహనాలను ఆపడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ట్రాఫిక్ ఉందనుకుంటే ఇండికేటర్ వేసుకుని కారు టర్నింగ్ తీసుకోవచ్చు.

     అలా సాధ్యమేనా...

    అలా సాధ్యమేనా...

    అద్దం దించి కారు టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు బైకర్ వచ్చి కోడిగుడ్డతో కొట్టి వెళ్లిపోయాడని చెబుతున్న మహేష్ కత్తి వాదనను ఖండిస్తున్నారు. కారు, బైక్ రెండు కూడా కదులుతున్నప్పుడు కోడి గుడ్డుతో కొడితే డ్రైవర్‌కు గానీ, కారుకు గానీ ఎక్కడా తగలకుండా మహేష్ కత్తికి మాత్రమే తగలడం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు.

    పొట్టకు తగిలినట్లు ఉంది..

    పొట్టకు తగిలినట్లు ఉంది..

    కోడిగుడ్డు మహేష్ కత్తి పొట్టకు తగిలినట్లు ఉందని, పొట్టకు తగిలితే కోడిగుడ్డు పగులుతుందా అని నెటిజన్లు అడుగుతున్నారు. ఒకవేళ అవన్నీ నిజమనుకున్నా మహేష్ కత్తి అక్కడికి వస్తున్నాడని బైకర్‌కు ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు.

    ఒక వేళ బైకర్ గమనించినా...

    ఒక వేళ బైకర్ గమనించినా...

    మహేష్ కత్తి అటువైపు వెళ్తున్నట్లు బైకర్ గమనించినా ఆ సమయంలో కోడిగుడ్లు ఎక్కడ దొరుకుతాయని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇన్ని రోజులు దాడి చేయనివారు ఇప్పుడు ఎందుకు చేస్తారని వారు ప్రశ్నిస్తన్నారు.

     కప్పిపుచ్చుకోవడానికే...

    కప్పిపుచ్చుకోవడానికే...

    తనపై వచ్చిన ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికే మహేష్ కత్తి కోడిగుడ్ల దాడి నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తన్నారు. మహేష్ చెబుతన్నదాంట్లో నిజం లేదని, అంతా వట్టిదనని, మహేష్ కత్తి డ్రామా ఆడుతున్నారని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+