టీవీ చానెల్ సర్వే: బడ్జెట్‌పై జగన్ మౌనం వెనక వ్యూహం?
అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విచిత్రంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మౌనం పాటిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం కేంద్రాన్ని పక్కన పెట్టేసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడుతున్నారు.
వైయస్ జగన్ మౌనం వెనక వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ ప్రతిపాదనకు కొద్ది రోజుల క్రితమే బిజెపితో కలిసి నడవడానికి తాను సిద్ధమని జగన్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయనే ప్రచారం ఊపందుకుంది.

జగన్ షరతు పెట్టినప్పటికీ...
బిజెపితో స్నేహానికి వైయస్ జగన్ షరతు పెట్టిన మాట నిజమే. ప్రత్యేక హోదాను ఆయన షరతుగా పెట్టారు. కానీ, బిజెపి, వైసిపి మధ్య పొత్తుకు లేదా స్నేహానికి ప్రాతిపదిక ఏర్పడానికి దాన్ని పరిష్కారం చేసుకోవడానికి తగిన మార్గం లభించవచ్చునని అంటున్నారు. వ్యూహంలో భాగంగానే జగన్ ఆ ప్రకటన చేశారని అంటున్నారు.
Recommended Video


అందుకే జగన్ మౌనం...
కేంద్ర బడ్జెట్‌పై జగన్ మాట్లాడకపోవడం వెనక బిజెపితో స్నేహసంబంధాలు నెలకొల్పుకోవాలనే వ్యూహం ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు టీజి వెంకటేష్ చెప్పారు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందాలని వైసిపి చూస్తోందని అన్నారు. టిడిపి లోపలి నుంచి, వైసిపి బయటి నుంచి బిజెపికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారని టీపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.

పొమ్మనలేక పొగ పెట్టారా...
తెగదెంపులు చేసుకునే అంశాన్ని బిజెపి జాతీయ నాయకత్వం చంద్రబాబు కోర్టులోకి నెట్టిందా అనే అనుమనాలు కలుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపడం ద్వారా చంద్రబాబును ఇరకాటంలో పెట్టినట్లే భావిస్తున్నారు. తమతో చంద్రబాబు తనంతతానుగా తెగదెంపులు చేసుకునేలా చేయడమే బిజెపి వ్యూహమా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆ టీవీ సర్వేనే కారణమా...
ఇటీవల అర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వైసిపికి 13 పార్లమెంటు సీట్లు, టీడీపి - బిజెపి కూటమికి 12 సీట్లు వస్తాయని ఆ సర్వే తేల్చింది. అంటే గత ఎన్నికల్లో కన్నా వైసిపికి ఐదు సీట్లు అదనంగా వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ బిజెపికి అనుకూలంగా ఉంటుందనే ప్రచారం ఉంది. ఆ టీవీ సర్వేనే అలా చెప్పిందంటే బిజెపికి సంకేతాలు ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. అందువల్ల టిడిపితో కొనసాగడం కన్నా జగన్‌ను మచ్చిక చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి బిజెపి జాతీయ నాయకత్వం వచ్చిందని అంటున్నారు.

జగన్ కూడా సానుకూలమే...
బిజెపితో కలిసి నడవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయనకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం. చంద్రబాబుతో బిజెపి తెగదెంపులు చేసుకుంటే తాను అధికారంలోకి రావడం సులభమవుతుందనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందువల్ల బిజెపిని టిడిపికి దూరం చేసి, తాను దగ్గర కావడం ద్వారా తన లక్ష్యాన్ని సులువుగా అందుకోవచ్చుననే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.

విజయసాయి రెడ్డి ఇలా మాట మార్చారు..
కేంద్ర బడ్జెట్‌పై తొలుత పెదవి విరిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ తర్వాత మాట మార్చారు. కేంద్ర బడ్జెట్ బాగానే ఉందని ఆయన ఆ తర్వాత అన్నారు. వైయస్ జగన్ తరఫున ఢల్లీ వ్యవహారాలు చూసేది ఆయనే. అందువల్ల జగన్ ఉద్దేశం ఆయన మాటల్లో వ్యక్తమైందని అంటున్నారు.

చంద్రబాబుపై ఇలా ఒత్తిడి
కేంద్ర బడ్జెట్ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి పెట్టడమే వ్యూహంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్ కేటాయింపుల విషయంలో వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి చంద్రబాబుపై విరుచుకపడ్డారు. దాన్ని బట్టి వైసిపి వ్యూహం అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబుపై పార్థసారథి ఇలా..
సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు ఏం సాధించలేకపోయారని వైసిపి నేత పార్థసారథి అన్నారు. నాలుగేళ్లుగా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని, విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెబుతున్న బాబు అటు వరంగల్, ఇటు హైదరాబాద్ వెళ్లిప్పుడు న వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారని ఎద్దేవా చేశారు.

సంబంధాలు బాగున్నాయని చెప్పుకుంటూ..
కేంద్రంతో సంబంధాలు బాగున్నాయని ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారని పార్థసారథి అన్నారు. ఈ ఏడాదే కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా అని నిలదీశారు. బడ్జెట్ పైన బాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఏపీ కోసం తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. మా పోరాటం చూసి కేంద్రంపై బాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్నారు.

వట్టి మాటలతో కాలయాపన
వట్టి మాటలతో ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వం కాలాయాపన చేసిందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై టీడీపీ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలాగే చేశారని ఆరోపించారు. కేంద్రం నుంచి బయటకు రావాలని, టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్నారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications