అలసందలతో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోండి!

మనం ప్రతిరోజూ తినే ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా వినియోగిస్తున్నాం. అలసందలు పోషకాల విషయంలో ఇవి చాలా బలమైనవి. శాకాహారంలో ప్రోటీన్ కోసం చూసేవారికి ఇవి మంచి ఎంపిక. వీటిలో పీచు, ఇనుము, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్‌తో పాటు విటమిన్ ఎ, సి కూడా ఉంటాయి. డైటీషియన్ల మాటల్లో, వీటిని ఉడికించి తింటే ఈ పోషకాలు ఎక్కువగా శరీరానికి అందుతాయి.

అలసందల్లోని కరిగే పీచు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇవి త్వరగా జీర్ణం కావు, కాబట్టి రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. మధుమేహం ఉన్నవారు తమ ఆహార ప్రణాళికలో భాగంగా తగిన పరిమాణంలో తీసుకోవచ్చు.

Alasandalu health Benefits Why This alasandalu Deserves a Place on Your Plate know the values

పీచు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. మలబద్ధకం తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి సహాయకారి. విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు బలంగా ఉండటానికి, కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ కలిసి ఉండటంతో ఇవి నెమ్మదిగా, నిలకడగా శక్తినిస్తాయి. ఒంట్లో వేడిగా అనిపించినప్పుడు తేలికైన అలసంద వంటకాలు తినడం మంచిదని చెప్తారు.

ఉడికించిన ఒక కప్పు అలసందల్లో సుమారు 13 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాములకు పైగా పీచు ఉంటుంది. వీటిలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారంలో మార్పులు చేసే ముందు గర్భిణులు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.శరీరంలో హానికారక టాక్సిన్స్ ను నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ కె నరాలకు బలాన్నిస్తుంది. రాత్రంతా నానబెట్టి, ఉదయం బాగా ఉడికించండి. దీనివల్ల త్వరగా ఉడకడమే కాక, కడుపులో గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది.

అల్లం పచ్చి కారంతో వంకాయ కూర.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
అల్లం పచ్చి కారంతో వంకాయ కూర.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

శరీరంలో కొవ్వు కరగాలనుకుంటే రోజుకో కప్పు ఉడకబెట్టిన అలసందలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుగ్గిళ్లు, కూర, సలాడ్, గారెలు, పులుసు, పులావ్‌లో కలుపుకోవచ్చు. కొందరికి అజీర్తి లేదా గ్యాస్ రావచ్చు. కిడ్నీ సమస్యలు, గౌట్ ఉన్నవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటించేవారు డాక్టర్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+