రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియ కోసం లవంగం నీటి ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి
ప్రతీ ఇంటా లవంగాలు తప్పని సరిగా ఉంటాయి. వంట ఇంటి మసాలా దినుసుల్లో వినియోగించే ఈ లవంగాలు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం లవంగాలు అద్భుతమైన ఔషధం. లవంగాలు నేరుగా తీసుకోవటం లేదా ఘాటు ఎక్కువగా ఉంటే నీటిలో వేసుకొని తాగటం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి. పలు రోగాలను నయం చేసే గుణం లవంగాలకు ఉంది. ఆరోగ్య పరంగా లవంగాల ద్వారా వచ్చే ప్రయోనాల గురించి ఆయుర్వే వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు.
నిత్యం లవంగాల నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆహారాన్ని జీర్ణాశయం సులభంగా జీర్ణం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం జీర్ణాశయ గోడలను సంర క్షిస్తుంది. దీంతో అల్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల లవంగాల నీళ్లను తాగితే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. లవంగాల్లో యాంటీ సెప్టిక్ గుణాలు సైతం ఉంటాయి. లవంగాలను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

లవంగాల నీళ్లను తాగితే శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అధ్యయనాల ప్రకారం లవంగాల నీళ్లను తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. లవంగాల్లో నైజెరిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు లవంగాల నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ గా వచ్చే రోగాల నుంచి బయట పడవచ్చని సూ చిస్తున్నారు. ఇలా.. లవంగాల నీళ్ల ను తీసుకోవటం ద్వారా అనేక ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications