పరగడుపునే తినండి.. వైద్యులకు దూరంగా ఉండండి
ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినడంవల్ల జీవితంలో డాక్టర్ అవసరమే రాదని ఒక సామెత ఉండేది. వాస్తవానికి అది నిజం కూడా. మన పెద్దలు ప్రతిరోజూ యాపిల్ తినమని చెబుతుంటారు. అనారోగ్య సమస్యలను దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. యాపిల్ పండు నిండా పోషకాలే ఉంటాయి. జీర్ణక్రియ నుంచి చర్మం వరకు అన్నింటికీ ఎంతో ఉపయోగం. పరగడుపుతో ఒక యాపిల్ తినడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ ఫైబర్ కు మూలం. తిన్నవెంటనే జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని చాలావరకు నియంత్రిస్తుంది. అంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్వెర్సెటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడడంలో శరీరానికి ఎంతో దోహదపడతాయి. శరీరంలోని పాత వ్యాధులను కూడా నయం చేస్తుంది. యాపిల్ లో ఫైబర్ ఎక్కువ. ఇది తిన్నతర్వాత కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.

యాపిల్ లో విటమిన్ డి ఉంటుంది. ఎముకలకు ఇది మంచిది. ఎముకలు దృఢంగా మారతాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి యాపిల్ చాలా మంచిది. యాపిల్ లోని విటమిన్ సి వరీరంలోని ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ను ప్రోత్సహిస్తుంది. శరీరం మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధం.












Click it and Unblock the Notifications