చేపలు తింటున్నారా? అయితే జాగ్రత్త!

మనకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాలలో చేపలు ముఖ్యమైనవి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. చేపలు తరచుగా తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు దొరకడంతో పాటు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డైటీషియన్లు చెబుతారు. అయితే చేపలు తినే విషయంలో కొంతమంది కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చేపలు ఎక్కువగా తింటే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

చేపలు తింటున్నారా?
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో చేపలు ఒకటి. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మన శరీరానికి కావలసిన ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంత మేలు చేసే చేపలు ఎక్కువగా తినడం వల్ల ఒక్కొక్కసారి అవి హాని కూడా చేస్తాయి. చేపలు కొన్నిసార్లు మన పేగు ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి. ఆహారాన్ని జీర్ణం చేస్తే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

Are you eating fish But over eating of fish harms health

చేపలను ఎక్కువ తింటే జరిగేదిదే
వాంతులు, వికారం, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. అయితే కొన్ని రకాల చేపలలో అధిక మొత్తంలో జింక్ ఉండటం వల్ల ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక అటువంటి చేపలను మితంగా తినాలి. ఎక్కువ తింటే ఖచ్చితంగా జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక కొన్ని రకాలు చేపలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని, మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

చేపలు ఎక్కువ తింటే చెడు బ్యాక్టీరియా ప్రభావం
అయితే సోడియం తక్కువగా ఉన్న చేపలను తినడం లేదా ఉప్పును పరిమితం చేసుకోవడంతో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు చేపలలో మన శరీరానికి కావలసిన ఫైబర్ అంతగా ఉండదు. ఫైబర్ లేకపోవడం కారణంగా ఇందులో చెడు బ్యాక్టీరియా పెరుగుదల జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చేపలను మరీ ఎక్కువగా తీసుకుంటే ఈ చెడు బ్యాక్టీరియా మన కడుపు పైన ప్రభావాన్ని చూపిస్తుంది.

జీర్ణ సమస్యలకు అవకాశం
ఇక కొన్ని రకాల చేపలలో మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్తి కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు పేగులలో మంటను పెంచి పేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి చేపలను తినాలనుకునేవారు వాటిని ఎంచుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి.

అలెర్జీలు, చర్మ సంబంధ సమస్యలు ఉంటే జాగ్రత్త
కొంత మందికి చేపలు తింటే అలర్జీలు వస్తాయి. చర్మ సంబంధమైన సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అలర్జీలు ఉన్నవాళ్లు చేపలను తక్కువగా తినాలి. కలుషితమైన నీటి వనరుల పెరిగిన చేపలను తింటే దాని ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన పడుతుంది. కనుక చేపలను తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+