కిడ్నీ పనితీరు మెరుగవ్వాలంటే - ఈ ఆహారాలు వదిలేయండి..!!
శరీరంలోని అవయవాల్లో కిడ్నీల పాత్ర ప్రధానమైనది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపేందుకు సమర్ధవంగా పని చేస్తాయి. కిడ్నీలు అలా చేయగలిగితేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్య పడుతుంది. అయితే... గుండె, లివర్ గురించి జాగ్రత్తలు తీసుకునే చాలా మంది కిడ్నీల విషయంలో నిర్లక్ష్యంతో ఉంటారు. దీంతో కిడ్నీల్లో రాళ్లు...మూత్ర విసర్జనలో సమస్యలు మొదలు అవుతాయి. కిడ్నీలు ఎంత సమర్ధంగా పని చేస్తాయి. అంతే స్థాయిలో జాగ్రత్తగా చూసుకోవాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు కొన్ని ఆహార పదార్ధాలను వదిలేయాలని సూచిస్తున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. సోడియం ఎక్కువగా తీసుకోవటం వలన రక్తపోటు అధికం అవుతుంది. హైబీపీ సమస్య ఉన్నవారికి కిడ్నీల పైన ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే మూత్రపిండాల్లోని రక్త నాళాల పైన ఒత్తిడి పెరిగి రక్తనాళాలు బలహీనం చేస్తాయి. ఫలితంగా క్రమంగా కిడ్నీల పని తీరు మందగిస్తుంది. హైబీపీ ఉన్నవారు ఆహారంలో ఉప్పును తక్కువ తీసుకోవటం ద్వారా ఈ ముప్పు నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా అల్ట్రా ప్రాసెస్ పదార్ధాల జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. రెడీ టు ఈట్ అంటూ విక్రయించే పదార్ధారల్లో సోడియం .. కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇక, ఒబేసిటీ సైతం మూత్రపిండాల పైన ఒత్తిడి పెంచుతుంది.

కూరగాయలు.. తృణధాన్యాలు తీసుకోవటం ద్వారా మూత్రపిండాలకు ఎలాంటి సమస్య ఉండ దని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచింది.
కోలా వంటి పానీయాల్లో ఉండే ఫాస్ఫోరిక్ ఆమ్లం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా, నిమ్మరసం.. కొబ్బరి నీరు వంటి వాటి ద్వారా శరీరంలో నీటి శాతం పెరిగి మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
శరీరానికి కావాల్సిన ప్రొటీన్ కోసం రెడ్ మీట్ వంటివి అధికంగా తీసుకుంటే ఫలితంగా క్రియోటిన్ లెవల్స్ పెరుగుతాయి. దీని కారణంగా దీర్ఘకాలంలో మూత్రపిండాల పనితీరు పై ప్రభావం చూపుతుంది. వీటి స్థానంలో పనీర్, పెరుగు, రాజ్మా వంటి వాటితో కావాల్సిన ప్రొటీన్ అందుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యవంతం గా ఉంచటంలో సహకరిస్తాయి.
ఇక, మధుమేహ వ్యాధి ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఉంది. మధుమేహం అదుపులో లేకపోతే మూత్రపిండాల రక్తనాళాల పని తీరు పైన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాల సమస్యతో కిడ్నీల పనితీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో.. షుగరును నియంత్రణలో ఉంచుకుంటూ.. డీప్ ఫ్రూ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉంటూ.. తాజా కూరగాయలు.. కావాల్సిన మోతాదులో ద్రవ పదార్ధాల ద్వారా మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications