ఖాళీ కడుపుతో తేనె కలిపిన నిమ్మరసం తాగితే ఉంటుంది.. నా సామిరంగ

చలికాలంలో నిమ్మ రసం తాగడం మంచిదేనా? వేసవిలో అలసట, నీరసం వచ్చినప్పుడు ఓ గ్లాసు నిమ్మరసం తాగడం చాలా మంచిది. ఎముకలు కొరికే శీతాకాలంలో కూడా నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి మేలు చేస్తుందా? లేక జలుము, న్యుమోనియా వంటి ఇబ్బందులు వస్తాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో కాసింత తెనే వేసుకుంటే ఇంకా బెటర్. ఈ అలవాటు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోజంతా శరీరానికి కావాల్సినంత ఎనర్జీని ఇస్తుంది. శీతాకాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు- గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు చురుకుగా మారతాయి.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. తద్వారా పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో సగం నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజూ నిమ్మకాయను సరైన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరమవడమే కాకుండా పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. నిమ్మ రసం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి- శరీరం నుండి విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడం. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడమే కాకుండా, చర్మ కాంతి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

నిమ్మకాయలో పొటాషియం అధికం. దీని రసాన్ని తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అది పరిమితంగా ఉండాలి. ఓ మోతాదులో తీసుకోవాలి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మరసాన్ని చక్కెర లేకుండా తీసుకోవాలి.

రాత్రిపూట నిమ్మ రసం తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే సైట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థపై కొంతవరకు ప్రభావం చూపుతుంది. అది ఎసిడిటీకి దారితీయవచ్చు. పంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిమ్మలోని ఆమ్లం.. దంతాల ఎనామెల్‌ను బలహీనపరుస్తుంది. కాబట్టి స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది.

Disclaimer: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ రకమైన ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+