వర్షాకాలంలో రోజుకో పండు.. రోగాలు రాకుండా హాయిగా ఉండు!

యాపిల్స్.. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే యాపిల్స్ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ సీజన్లో యాపిల్ పండ్లు తినడం చాలా మంచిది. ఇది వర్షాకాలంలో వచ్చే వివిధ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మన ఇమ్యూనిటీని పెంచడానికి కీలక భూమిక పోషిస్తుంది.

యాపిల్స్ లో పోషకాలు

యాపిల్స్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాపిల్స్ లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్, పొటాషియం కూడా యాపిల్స్ లో ఉంటాయి. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందించే యాపిల్స్ మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇవి మన ఇమ్యూనిటీని మెరుగు పరచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి.

Boost Immunity With Apples Health Benefits During Monsoon Season with apples

యాపిల్స్ తో రోగాలతో ఫైట్ చేసే శక్తి

యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీ రాడికల్స్ తో పోరాటానికి సహాయం చేస్తాయి. నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. యాపిల్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరం వివిధ రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటుంది. యాపిల్స్ లో అధికంగా నీటి కంటెంట్ ఉంటుంది. ఇది హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

వర్షాకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం యాపిల్స్

యాపిల్స్ లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరస్థాయిలు పెంచకుండా శక్తిని అందించడానికి దోహదం చేస్తాయి. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదని చెబుతారు.ముఖ్యంగా ఈ వర్షాకాలంలో యాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్ తినడం వల్ల మధుమేహం నియంత్రణ అవడం మాత్రమే కాకుండా గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

సీజన్ ఏదైనా ఆహారంలో యాపిల్ ఉంటే బెస్ట్

యాపిల్స్ తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాపిల్ బరువు నియంత్రణకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా యాపిల్ ఉపయోగపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది .ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే యాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే సీజన్ ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+