కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా? ఎముకలు...!
ప్రస్తుత రోజుల్లో మనుషులు మంచినీరు తాగకుండా అయినా ఉంటున్నారుకానీ కూల్ డ్రింక్ తాగకుండా మాత్రం ఉండటంలేదు. దైనందిన జీవితాలతో ఈ శీతల పానీయాలు అలా పెనవేసుకుపోయాయి. ఇవి కేవలం బరువును పెంచుతాయేకానీ ఎటువంటి ఉపయోగం ఉండదని తాజాగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది.
గుండెజబ్బుల ప్రమాదం : మితిమీరి కూల్ డ్రింక్స్ తాగుతున్న పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతోంది. అంతేకాదు.. బరువు పెరగడంవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు. ఎముకల పెరుగుదలకు ఫాస్పరస్ ఎంతో ముఖ్యమైంది. ఎముకల అభివృద్ధికి తగినంత ఫాస్పరస్ తీసుకోవాలి. తక్కువ సీరం ఫాస్పేట్ స్థాయిలు పోషకాహార లోపాన్ని సూచిస్తాయి. బోలు ఎముకలు, ఎముకల పగుళ్లు లాంటి ప్రమాదాలను కూల్ డ్రింక్స్ పెంచుతాయి.
ప్రొటీన్ లోపం : మనిషి శరీరం ఎప్పుడూ దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు చాలా అవసరం. కూల్ డ్రింక్స్ పదే పదే తాగుతుండటంవల్ల ప్రొటీన్ లోపం తలెత్తుతుందని నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలను తాగేబదులుగా పుచ్చకాయ, కర్చూజ లాంటి పండ్ల రసాలు తీసుకోవాలంటున్నారు. వీటిని పంచదార లేకుండా తాగితే ఇంకా మంచిందంటున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగతూ ఉండాలని చెబుతున్నారు. ఎముకలకు నష్టం జరగకుండా ఉండటానికి కాల్షియం తోడ్పడుతుంది. శరీరంలో యాసిడ్ బేస్ స్థాయిలను నియంత్రిస్తుంది.

కాల్షియంను హరిస్తాయి: చల్లటి శీతల పానీయాలు మన ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలోనున్న కాల్షియంను కూడా హరించివేస్తాయి కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా శీతల పానీయాలు తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు చల్లగా వున్నవాటిని ఎంచుకోవడం మంచిది అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications