షుగరు ఉన్నవారు బెల్లం తినొచ్చా?
ప్రస్తుత రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో తేడా లేకుండా చిన్నా పెద్దా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లం తినే అవకాశం ఉందా? అనే అనుమానం అందరిలో వస్తోంది. దీనిపై వైద్యనిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అయితే స్వచ్ఛమైన రూపంలో దొరికితేనే తినాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన బెల్లం దొరకడం అసాధ్యమని చెప్పవచ్చు. పంచదార కన్నా బెల్లమే ప్రమాదకరంగా మారిందని, బెల్లంతో చేసినవి తినడం మానేయాలని, అవసరమైతే స్వచ్ఛమైన బెల్లంతో ఇంట్లో చేసుకొని తినాలని చెబుతున్నారు.

మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి అని, సరైన ఆహారం తీసుకోకపోవడంవల్ల కూడా షుగరు సంక్రమిస్తోందంటున్నారు. విటమిన్లు, మినరల్స్, ఖనిజాల సమతుల్యత ఉన్న ఆహారాన్ని ఎవరూ తీసుకోవడంలేదని, ఇది కూడా షుగరు రావడానికి ఒక ప్రధాన కారణమవుతోందన్నారు.
ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి మారిపోతోంది. ఇష్టమొచ్చిన సమయానికి నిద్రపోయి ఇష్టమొచ్చిన సమయానికి లేస్తున్నారు. దీనివల్ల వ్యాయామం కూడా చేయడంలేదు. మధుమేహ వ్యాధి రావడానికి ఇది కూడా ఒక కారణమవుతోంది. విస్తృతమైన కాలుష్యం కూడా మధుమేహానికి కారణమవుతోందని, స్వచ్ఛమైన గాలి లేకపోవడం కూడా ఒక కారణమంటున్నారు. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం కూడా ప్రజలకు సమస్యగా మారుతోంది. దీనివల్ల కూడా మధుమేహం వస్తోంది.












Click it and Unblock the Notifications