డేంజర్ బెల్స్ మోగిస్తున్న కీళ్ళవాతం... జాగ్రత్త
కీళ్లవాతం.. ఇది మన శరీరంలోని కీళ్ళను ప్రభావితం చేసే దీర్ఘకాలిక రుగ్మత. ప్రస్తుతం చాలా మంది కీళ్ళ వాతంతో ఇబ్బంది పడుతున్నారు. కీళ్లవాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి, వాపు వంటి లక్షణాలు కలగడం ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పైన దాడి చేయడం వల్ల కలిగే రుగ్మత .
కీళ్ళ వాతం లక్షణాలు ఇవే
కీళ్లవాతం ఉన్నప్పుడు చాలామందిలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట నిద్రలేచిన వెంటనే కీళ్లు బిగుసుకుపోయి నడవడానికి ఇబ్బంది పడతారు. కాసేపు విశ్రాంతి తీసుకొని లేచి నడవాలంటే ఎక్కడికక్కడ కీళ్లు పట్టుకు పోయినట్టుగా ఉంటాయి. చేతులు మణికట్టు మరియు మోకాళ్ళ వంటి అనేక కీళ్లు కీళ్లవాతం తో ప్రభావితమవుతాయి నొప్పి వాపు ఎరుపు మరియు మంట వంటి లక్షణాలు ప్రధానంగా కీళ్లవాతం లో కనిపిస్తాయి.

కీళ్ళ వాతం విషయంలో జాగ్రత్త
కీళ్లవాతం ఉన్నవారికి కొన్నిసార్లు అలసట, కీళ్ల పనితీరులో తేడాలు కూడా కనిపిస్తాయి. కీళ్లవాతం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కీళ్లవాతం ఒక దీర్ఘకాలికమైన సమస్య. దీనిని పట్టించుకోకున్నా , సరిగా మందులు వాడకుండా, జీవనశైలి మార్చుకోకున్నా, సరైన ఆహార నియమాలు పాటించకున్నా ఇది మరింత తీవ్రతరమై జీవితాన్ని నరకం చేస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడం వల్ల కీళ్లవాతం
అసలు కీళ్లవాతం ఎందుకు వస్తుంది అనే దానికి ఖచ్చితమైన కారణం తెలియదు. జన్యుపరమైన అంశాలు, పర్యావరణ కారకాలు కూడా కారణం కావచ్చు. కీళ్లలోని సైనోవియం అనే లైనింగ్ పైన మన రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడం వల్ల కీళ్లవాతం సంభవిస్తుంది.
ఈ చర్యలతో కీళ్ళ వాతం నుండి విముక్తి
ఇక కీళ్లవాతం నివారించడానికి మనం తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించడం ఒక మంచి పద్ధతి. దుంప కూరలను తినకుండా ఉండడం మంచిది. కీళ్లవాతం నుండి ఉపశమనం కోసం వైద్యుల దగ్గర మందులను ఉపయోగించడంతో పాటు ఫిజియోథెరపీ వంటివి చేయించుకోవడం మంచిది. సరైన జీవన శైలి మార్పులు, వ్యాయామం వంటి వాటితో కీళ్లవాతం నియంత్రించవచ్చు.












Click it and Unblock the Notifications