మందార పూల టీ తాగితే మీ ఆరోగ్యంలో జరిగేవి అద్భుతాలే.. ట్రై చెయ్యండి!

ఇటీవల కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఉదయం పూట టీ తాగే విషయంలో చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తేయాకుతో తయారుచేసిన టీ కి బదులు శంఖు పూల టీ, మందార పూల టీ, తులసి ఆకుల తో టీ, గ్రీన్ టీ, బ్లూ టీ, లెమన్ టీ ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

మందార పువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ప్రస్తుతం మనం మందార పూలతో తయారుచేసే టీ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. మందార చెట్టు రకరకాల రంగులతో రకరకాల సైజులలో పూస్తుంది. మందార పువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మందార పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంవల్ల ఇది మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Drinking hibiscus flowers tea will do wonders for your health Try it

మందార పూల టీతో యవ్వనంగా
మందార పూల టీ తాగితే మన చర్మం వృద్ధాప్య సంకేతాలను ఇది తగ్గిస్తుంది. శరీరాన్ని డిహైడ్రేడ్ కాకుండా మందార పూల టీ కాపాడుతుంది. మందార పూల టీ ని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. ఇక మందార పూల టీని తయారు చేసే విధానానికి వచ్చినట్లయితే మందార పువ్వులను బాగా ఎండబెట్టి ఆ ఎండిన పూలను పక్కన పెట్టుకోవాలి.

మందార పూల టీ తో బరువుకు చెక్
నీటిని బాగా మరగపెట్టి అందులో ఎండిన మందార పూలను వేసి మరిగించాలి. ఇక మందార పువ్వుల టీ ని తయారు చేయడానికి ఎండిన పువ్వులనైనా, తాజాగా ఉన్న పువ్వులనైనా వాడవచ్చు. ఈ పూల టీని తాగితే బరువు కూడా తగ్గుతారని ఎన్నో అధ్యాయాలు ఇప్పటికే వెల్లడించాయి. దీనిని ఒక హెర్బల్ టీ గా చెప్తారు. ఈ టీతో అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.

మందార పూల టీ తో డయాబెటిస్, బీపీ కంట్రోల్
మందార పూల టీతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. డయాబెటిస్, మూత్రపిండాలు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు మందార పూల టీ ఎంతో బాగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మందార టీని తప్పనిసరిగా ట్రై చెయ్యండి. అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+