చేప తలకాయ తింటున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
ప్రతి ఒక్కరు వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు మన శరీరానికి పోషకాలు వచ్చే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. అటువంటి పోషకాలు వచ్చే ఆహారాన్ని ఎంచుకొని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే శాఖాహారులు పప్పు కూరలు, ఆకు కూరలతో పోషకాలను పొందుతుంటే, మాంసాహారులు చికెన్, మటన్, చేపలు తింటూ ఉంటారు.
చేప తలకాయ తినటం మంచిదేనా
ఇక మన శరీరానికి పోషకాలు ఇచ్చే ఆహారంలో ముఖ్యంగా చెప్పవలసినవి చేపలు. శాఖాహారులను మినహాయించి మాంసాహారుల విషయానికి వస్తే చేపలు శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే చేపలను తినేవారు ప్రత్యేకించి చేప తలకాయను కూడా తింటూ ఉంటారు. కొంతమంది చేప తలకాయలనే స్పెషల్ గా వండుకొని తినేవారు కూడా ఉన్నారు.

చేప తలకాయలో పోషకాలు
అయితే చేప తలకాయ తినడం మంచిదేనా? చేప తలకాయ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చేప తలకాయలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు చేప తలకాయలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
కళ్ళు, మెదడు ఆరోగ్యానికి చేప తల
ముఖ్యంగా పిల్లలు, వృద్దులు చేప తలలను తినడం వల్ల వీరికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. చేప తలకాయ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. చేపల తలకాయలను తినడం వల్ల మెదడుకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తరచుగా మతిమరుపుతో బాధపడేవారు చేపతలను తింటే మతిమరుపు తగ్గుతుంది. మెదడు పదునుగా పనిచేస్తుంది. ఏదైనా సరే గుర్తుంచుకోగలిగిన సామర్థ్యం కూడా పెరుగుతుంది.
చేప తల తింటే ఆరోగ్యం
అంతేకాదు చాలామంది శరీరంలో రాళ్ల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కిడ్నీలలో రాళ్లతోటి బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు చేప తలకాయ తినడం వల్ల రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే చేపలలో మన శరీరానికి పనికివచ్చే అనారోగ్యాలను దూరం చేసే ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. కనుక చేపతల తినొచ్చా లేదా అన్న సంశయం పక్కనపెట్టి ఎంచక్కా చేప తలను తినేయండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications