సముద్రం చేప తింటున్నారా? చెరువు చేప తింటున్నారా? తెలుసుకోండి!
చేపను ఎంతోమంది ఇష్టంగా తింటారు. మరికొందరు ఆరోగ్యం కోసం తింటారు. ఇలా తీసుకునే సమయంలో తాము సముద్రం చేపను తింటున్నామా? లేదంటే చెరువులో పెరిగిన చేపను తింటున్నామా? అనే విషయంలో స్పష్టత ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండురకాల చేపల్లో ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం అయితే ఐస్ చేపలు కూడా దొరుకుతున్నాయి. కొంతమంది వాహనం వెనకవైపు నీళ్లు పోసి వాటిల్లో చేపలను తీసుకువచ్చి అక్కడే కోసి అమ్ముతున్నారు.
చెరువు చేపల్లో ఆమ్లాలు తక్కువ
ఆరోగ్య నిపుణులు మాత్రం సముద్రం చేపలు మంచివని చెబుతున్నారు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. విటమిన్ డి ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే సెలీనియం మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది. గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సముద్రంలోని అన్నిరకాల చేపలను తినొచ్చు. ఎముకలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. చెరువు చేపల్లో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి.

కళ్ల సమస్యలు రాకుండా చేస్తాయి
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కళ్ల సమస్యలు రాకుండా చేస్తాయి. కంటిచూపు బాగా మెరుగుపడుతుంది. సముద్రం చేపలు శారీరక ఆరోగ్యాన్ని కాపడటమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపడటంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ నుంచి విముక్తి పొందడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అలాగే వీటిని తినడంవల్ల సూర్మరశ్మి వల్ల చర్మం నల్లగా మారకుండా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు మతిమరుపు తగ్గుతుంది. చర్మంపై ముడతలు రాకుండా చూస్తాయి. యవ్వనంతో ఉండేటట్లు చేస్తాయి. వారానికి ఒకసారైనా కనీసం సముద్రం చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications