గంటలకొద్దీ వ్యాయామం చేస్తున్నారా? అతి వ్యాయామంతో ఏం జరుగుతుందంటే!

ప్రస్తుత జీవన శైలిలో చాలామంది వేగంగా బరువు తగ్గాలని తెగ వ్యాయామం చేస్తున్నారు. బాడీ షేప్ కూడా బాగుండాలని జిమ్ లకు వెళ్లి కష్టపడుతున్నారు. గంటల పాటు తెగ చెమటోడుస్తున్నారు. అయితే అటువంటివారు వ్యాయామం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

అతి వ్యాయామం అనర్ధాలకు కారణం
వ్యాయామైనా భోజనం అయినా ఏదైనా సరే అతి సర్వత్ర వర్జతే అని పెద్దలు చెబుతారు. ఏదైనా అతిగా చేస్తే అది అనర్ధాలకే దారి తీస్తుంది. తీవ్రంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒంట్లో నీళ్ల శాతం వేగంగా తగ్గి శరీరం డిహైడ్రేట్ అవుతుంది. అందుకే అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదని చెబుతారు.

Exercising for hours those who are doing over exercise these must be known

అతి వ్యాయామంతో కండరాలకు నష్టం
ఎక్కువ సమయం పాటు శక్తికి మించి కష్టపడడం మంచిది కాదని వేగంగా బరువు తగ్గాలని చేసే ఈ ప్రయత్నంలో కండరాల పైన తీవ్ర ఒత్తిడి పడుతుందని, కొన్నిసార్లు కండరాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. కొందరు ఆహారాన్ని తక్కువ తీసుకుంటూ వ్యాయామాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామానికి కావలసిన శక్తికి సరిపోయే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే కాస్త ఎక్కువ వ్యాయామం చేయొచ్చు.

అనారోగ్యంగా ఉన్నా వ్యాయామం చేస్తున్నారా?
అలా అని మరీ గంటలు గంటలు వ్యాయామం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు.. బరువు తగ్గడానికి వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. కొందరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ వ్యాయామంపైనే ఫోకస్ చేసి తెగ వ్యాయామం చేస్తూ ఉంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి.

వ్యాయామం నుండి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వొచ్చా
ఆరోగ్యం బాగోనప్పుడు వ్యాయామం చేయకుండా ఉంటేనే మంచిది. ఇక నిత్యం వ్యాయామం చేసేవారు వారంలో ఒకరోజు వ్యాయామం నుంచి సెలవు తీసుకోవాలి. అప్పుడే మెదడు, కండరాలు చురుగ్గా పనిచేస్తాయి అధిక వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల మంచి జరగకపోగా చెడు ఎక్కువ జరుగుతుంది.

అధిక వ్యాయామాలు ఆపాలంటే ఇలా చెయ్యాలి
ఒళ్ళు నొప్పులు రావడం, నీరసం రావడం, నిరాశ, నిస్పృహలు ఆవహించడం వంటివి జరుగుతాయి. ఇక అధిక వ్యాయామాలను కొద్దిరోజులు ఆపేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారిగా పూర్తిగా మానేస్తే మంచిది కాదు. దాని బదులు యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇక వ్యాయామం చేసినా, ఏది చేసినా గుండెపైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+