అల్లం టీ Vs లెమన్ టీ..ఎవరికి ఏది మంచిది..!!
ప్రతీ ఇంటా ఉదయం వేళ టీ ఉండాల్సిందే. చాలా మందికి ఉదయం లేవగానే టీ లేకుండా రోజు ప్రారంభం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు పలు సందర్భాల్లో టీ తాగేవారు చాలా మంది కనిపిస్తారు. ఆరోగ్యం పైన అవగాహన పెరుగుతున్న కొద్దీ టీ తీసుకునే వారి అభిరుచుల్లోనూ మార్పు కనిపిస్తోంది. చాలా మంది ఈ మధ్య కాలంలో అల్లం టీ.. లెమన్ టీ వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీ వినియోగం బాగా పెరిగింది. దీంతో.. అసలు ఆరోగ్య పరంగా అల్లం టీ.. లెమన్ టీ ల్లో ఏది ఎవరికి మంచిదనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు టీ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. సాధారణ టీ కంటే ఈ మధ్య కాలంలో అల్లంటీ, లెమన్ టీ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో ఈ రెండు రకాల టీల కోసం ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. అల్లంలో ఉండే జింజెరాల్స్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపు, గొంతు నొప్పి లేదా దగ్గు ఉన్నప్పుడు ఉదయాన్నే అల్లం టీ తాగడం శరీరానికి ఉపశమనంగా మారుతుంది. అదే విధంగా భోజనం తర్వాత లేదా ఉదయాన్నే తాగితే అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అదే విధంగా అల్లం టీ శీతా కాలంలో శరీర వేడిని తగ్గించి...శరీరానికి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. కాగా.. నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి లెమన్ టీ బెస్ట్ ఆప్షన్ గా స్పష్టం చేస్తున్నారు.

ఆరోగ్య పరమైన ప్రయోజనాలు
దీంతో పాటుగా శరీరపు ఫ్యాట్ ద్రవ్యం త్వరగా శక్తిగా మారుతుంది. పని ఒత్తిడిలో ఉన్నవారికి లెమన్ టీ వాసన మనసును ప్రశాంతంగా చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది. దీని ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఉద్యోగాల్లో.. ఇతర సమస్యల్లో ఒత్తిడి.. అలసటగా ఉన్న సమయంలో లెమన్ టీ మూలు చేస్తుంది. ఆలోచనల ను ఫ్రెష్ గా మార్చేందుకు దోహద పడుతుంది. జలుబు, అలసట, అజీర్తి సమస్య ఉంటే అల్లం టీ. బరువు తగ్గడం, మానసిక చురుకుదనం, చర్మ శ్రేయస్సు కోసం లెమన్ టీని తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. తయారీలో చేసే సాధారణ తప్పు చాలామంది టీని గంటల తరబడి మరిగిస్తూ ఉంటారు. ఇలా మరిగించటం ద్వారా అల్లం.. నిమ్మలోని ఔషధ గుణాలు తగ్గిపోతాయి. నీటిని మరిగించాక అల్లం తురుము లేదా నిమ్మరసం వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచడం ద్వారా పోషకాలు అందులోని ఉండిపోతాయి. వయసు.. సమస్యల ఆధారంగా ఏ టీ తాగాలో ఎంపిక చేసుకోవటం ఉత్తమమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications