sesame seeds: మన ఇళ్ళలో ఉండే ఈ చిన్నగింజల్లో నూరు ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు ఒక మంచి పోషకాహారం. సంప్రదాయ భారతీయ వైద్యంలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో, నువ్వులకు శతాబ్దాల నుంచి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చిన్న గింజలు, పోషకాల గని అని చెప్పకే తప్పదు. నువ్వులలో ఉండే పోషకాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడే యాంటీఆక్సిడెంట్లు కూడా నువ్వుల్లో లభిస్తాయి.
నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు
ఆయుర్వేదం ప్రకారం, నువ్వులు శరీరానికి వెచ్చదనాన్ని, శక్తిని ఇస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, శక్తి స్థాయిలను పెంచుతాయని చాలామంది విశ్వసిస్తారు. నువ్వుల గింజల నుంచి తీసిన నూనెను తరచుగా మసాజ్‌ల కోసం వాడతారు. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి తోడ్పడటమే కాకుండా, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతారు.

నువ్వులలో ఫుల్ పోషకాలు
నువ్వుల గింజల్లో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు వీటిలో ఉంటాయి. అంతేకాదు, ఇవి ప్రొటీన్‌ను కూడా అందిస్తాయి. అందుకే శాకాహారులకు నువ్వులు ఒక మంచి ఆహార వనరు. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందించే నువ్వులు ప్రతి ఒక్కరు కచ్చితంగా డైట్ లో భాగంగా చేసుకోవాల్సిందే.
వంటలో ఉపయోగాలు
భారతీయ వంటకాల్లో నువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి వంటకాలకు చక్కటి రుచి, సువాసనను అందిస్తాయి. మనదేశంలో అనేక వంటకాలలో నువ్వులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. నువ్వులను వేయించడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. నువ్వులను చాలా వంటకాల పైన ఫుడ్ డెకరేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు.
సాంప్రదాయ విధానాలలో నువ్వుల వాడకం
మకర సంక్రాంతి వంటి పండుగల సమయంలో నువ్వులకు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. నువ్వులు శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, శక్తిని ఇస్తాయని నమ్ముతారు. పండుగలు, ఆచారాలలో వీటిని వాడటం కేవలం పోషకాల కోసమే కాకుండా, వాటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. మొత్తంగా చూస్తే, భారతీయ సంప్రదాయాల్లో నువ్వు లు ఎంతగానో కలిసిపోయాయి. వంటకాల దగ్గర్నుంచి వైద్యం వరకు వీటి ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది.












Click it and Unblock the Notifications