ఈ ఆహారాలతో క్యాన్సర్ ముప్పు.. జాగ్రత్త!!
మరణాలకు కారణమవుతున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. అనారోగ్యకరమైన జీవనశైలి, మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల కారణంగానే క్యాన్సర్ అకస్మాత్తుగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అయితే మంచి ఆహారపు అలవాట్లు వదిలిపెట్టి తినకూడని ఆహారాలు ఎక్కువగా తింటున్నారు. ప్రస్తుతం మనం క్యాన్సర్ కారకమైన కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

క్యాన్సర్ కారకమైన ఆహారాలలో ప్రాసెస్ చేసిన ఆహారాలు ఒకటి .ఇవి మనకు తెలియకుండానే మన శరీరంలో క్యాన్సర్ కారక కణాలను ప్రేరేపిస్తాయి. సరిగ్గా ఉడికించిన మాంసం శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ మాంసాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అది శరీరానికి హానికరంగా మారుతుంది.అంతేకాదు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.
పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల వస్తుంది. రెడ్ మీట్ ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరమని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన రెడ్ మీట్ తినడం, పెద్ద పేగు క్యాన్సర్ కు కారణం అవుతుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లో కార్సినో జెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
అలాగే చక్కెర పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయం వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక విపరీతమైన మద్యపానాన్ని సేవించడం కూడా క్యాన్సర్ కారకంగా మారుతుంది. దీనివల్ల అన్నవాహిక క్యాన్సర్, కాలేయం, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు.
మైదాపిండి మరియు ప్రాసెస్ చేసిన నూనెల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ప్యాక్ చేసిన ఇన్స్టంట్ ఫుడ్స్ తో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. సాధ్యమైనంతవరకు ఫాస్ట్ ఫుడ్ లోకి దూరంగా ఉండడం క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడుతుంది. కాబట్టి క్యాన్సర్ కారకాలైన ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications