health tips: దాల్చినచెక్క.. డయాబెటిస్, బీపీ, బరువును తగ్గించటంలో దీనికి ఉందో లెక్క!!

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి.

దాల్చిన చెక్క.. మన వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు, ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న దాల్చిన చెక్క ఆరోగ్య సంజీవని అంటే అతిశయోక్తి కాదు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దాల్చిన చెక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరూ దాల్చిన చెక్కను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

దాల్చిన చెక్కలో బోలెడు ఔషధ గుణాలు.. అనాదిగా మెడిసిన్ గా దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో బోలెడు ఔషధ గుణాలు.. అనాదిగా మెడిసిన్ గా దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి, వివిధ అనారోగ్య పరిస్థితుల నుండి మనల్ని రక్షించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. పురాతన ఈజిప్టు కాలం నుండి దాల్చిన చెక్కను అనేక అనారోగ్యాలను తగ్గించడానికి వినియోగించేవారు. మధ్య యుగ కాలంలో దగ్గు, గొంతు నొప్పి, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి చేసే చికిత్సలో దాల్చిన చెక్కను ఉపయోగించేవారు.

దాల్చిన చెక్కతో ఎన్ని వ్యాధులు తగ్గుతాయంటే

దాల్చిన చెక్కతో ఎన్ని వ్యాధులు తగ్గుతాయంటే

దాల్చిన చెక్కతో కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కొన్ని రకాల క్యాన్సర్లు , హృదయ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో కూడా దాల్చిన చెక్క గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి దాల్చిన చెక్క మనల్ని రక్షిస్తుంది. రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఓ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా దాల్చిన చెక్క ప్రభావంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క నూనెను ఉపయోగించినప్పటికీ మెరుగైన ఫలితం ఉంటుంది

దాల్చిన చెక్కతో డయాబెటిస్ కంట్రోల్

దాల్చిన చెక్కతో డయాబెటిస్ కంట్రోల్

ఇక టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రోజుకు ఆరు గ్రాముల చొప్పున దాల్చిన చెక్కను తినడం వల్ల 40 రోజుల నుండి నాలుగు నెలల మధ్య వ్యవధిలో వారి ఆరోగ్యంగా గణనీయమైన మార్పు వస్తుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, శరీరంలో చెడు కొవ్వు శాతం తగ్గడం వంటి పరిణామాలను చూడవచ్చని చెబుతున్నారు. అలా అని డయాబెటిస్ బాధితులు దాల్చిన చెక్కను మాత్రమే వినియోగిస్తే ఫలితం ఉండదని, శారీరక వ్యాయామం, ఆహార నియమాలు, వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

అల్జీమర్స్, సోరియాసిస్, గుండె, క్యాన్సర్ లకు దివ్యౌషధం

అల్జీమర్స్, సోరియాసిస్, గుండె, క్యాన్సర్ లకు దివ్యౌషధం


దాల్చిన చెక్క అల్జీమర్స్ వ్యాధిని నయం చేయడంలోనూ, నరాల సంబంధిత సమస్యలను, నరాలలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. హెచ్ఐవి ప్రభావం నుండి కూడా దాల్చిన చెక్క కాపాడుతుందని చెబుతున్నారు. సోరియాసిస్ సమస్యలకు దీర్ఘకాలంగా నయం కానీ అనేక రకాల గాయాల చికిత్సకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుందంటున్నారు. గుండె సంబంధిత సమస్యలను, క్యాన్సర్ ను కూడా నిత్యం దాల్చిన చెక్క తీసుకున్న వారు నియంత్రించే శక్తిని కలిగి ఉంటారని సూచిస్తున్నారు. దాల్చిన చెక్కతో తలనొప్పి సమస్య కూడా తగ్గుతుంది.

బీపీ, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించే దాల్చిన చెక్క

బీపీ, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించే దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మన మెటబాలిజం ను మెరుగుపరుస్తుందని, ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యానికి కూడా దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బీపీని తగ్గించడంలో దాల్చిన చెక్క గణనీయమైన పాత్రను పోషిస్తుంది అంటున్నారు. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పై పోరాటం చేస్తుందని, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, బరువు తగ్గడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని అంటున్నారు. మహిళలలో ముఖ్యంగా ఉండే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+