వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Health tips: బీపీతో పాటు బోలెడు రోగాలకు కొత్తిమీరతో చెక్.. రోజూ ఆహారంలో తీసుకోండి!!

బీపీతో పాటు బోలెడు రోగాలకు కొత్తిమీరతో చెక్ పెట్టొచ్చు అని వైద్యులు చెప్తున్నారు. రోజూ ఆహారంలో కొత్తిమీర ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

కొత్తిమీర.. కొత్తిమీరతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిత్యం ఆహారంలో కొత్తిమీరను ఒక భాగం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని నేచురోపతి వైద్యులు చెబుతున్నారు. అసలు కొత్తిమీర ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది? ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుందో తెలిస్తే ప్రతిరోజు కొత్తిమీరను మన ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకుని తీరుతాం.

కొత్తిమీరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ఇక కొత్తిమీరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే.. కొత్తిమీర మన జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులు వికారానికి, అజీర్ణ సమస్యలు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు నివారణ అవుతాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎక్కువ హైబీపీతో బాధపడుతున్న వారు బీపీ నుండి ఉపశమనం పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. కొత్తిమీర లో ఉండే సుగుణాలు హైబీపీ నుంచి, గుండెపోటు ప్రమాదం నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపడతాయి.

కొత్తిమీర మంచి ఇమ్యూనిటీ బూస్టర్..

కొత్తిమీర మంచి ఇమ్యూనిటీ బూస్టర్..

ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా కొత్తిమీరని వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొత్తిమీరను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకునే వారికి ఎముకలు దృఢంగా ఉంటాయి. కొత్తిమీర లో ఉండే కాల్షియం, మినరల్స్ ఎముకలు బలంగా ఉంచడమే కాకుండా, ఎముకల రిగ్రోత్ కు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్తిమీరను నిత్య ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది.

నరాల సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి..

నరాల సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి..

నరాలకు సంబంధించిన అనేక సమస్యలకు కొత్తిమీర మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. రెగ్యులర్ గా కొత్తిమీర ఉన్న ఆహారంలో తీసుకోవడం వల్ల అల్జీమర్స్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ ను బాగా తగ్గించవచ్చు. కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను గణనీయంగా తగ్గించవచ్చు. కొత్తిమీర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంతోపాటు, బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలోనూ కొత్తిమీర గణనీయమైన పాత్రను పోషిస్తుంది.

కొత్తిమీరతో చర్మానికి మేలు

కొత్తిమీరతో చర్మానికి మేలు

అంతేకాదు కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇన్ బాలన్స్ తగ్గుతుంది. మహిళలకు బహిష్టు సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుము నొప్పి వంటి ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరంపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గించడంలో కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుంది. పెదవులు నల్లగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసాన్ని పెదవులపై రాస్తే పెదవులు లేతరంగును సంతరించుకుంటాయి.

కళ్ళకు కొత్తిమీర ఎలా పని చేస్తుందంటే

కళ్ళకు కొత్తిమీర ఎలా పని చేస్తుందంటే

కొత్తిమీర కళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్ కంటి సమస్యలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్ కంటి మీద ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వయసు పెరగడం వల్ల వచ్చే అనేక సమస్యలకు చెక్ పెడుతుంది.

కొత్తిమీరతో అందం .. ఆరోగ్యం

కొత్తిమీరతో అందం .. ఆరోగ్యం

అంతే కాదు కొత్తిమీర నోటి అల్సర్లను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ముఖ సౌందర్యానికి కూడా కొత్తిమీర చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని సుగుణాలు ఉన్న కొత్తిమీరను నిత్య ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు; రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!health tips: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు; రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!

English summary
Naturopathic doctors say that there are many health benefits of coriander and if taken daily it can reduce BP, bad cholesterol, eye problems and indigestion problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X