health tips: పెరుగుతో ఆరోగ్యమే.. కానీ ఇలా తింటేనే డేంజర్!!

పెరుగును చాలామంది ఇష్టంగా తింటారు. కొంతమంది పెరుగును అసలే తినని వాళ్ళు కూడా ఉంటారు. అయితే పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, మన కడుపులో ఆరోగ్యకరమైన బాక్టీరియాను పెంచి జీవక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుందని ఎంతో మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని కూడా చెబుతున్నారు. అయితే పెరుగు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి పెరుగును పొరపాటున కూడా తినకూడదని చెబుతున్నారు.

నిత్యం పెరుగును తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందని, పెరుగు గట్ హెల్త్ ను బాగా పెంచుతుందని తెలుసుకోవలసిన అవసరం ఉంది. అంతేకాదు పెరుగుతో ఊబకాయానికి చెక్ పడుతుందని, శరీర వాపు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే పెరుగును తినేవారు కచ్చితంగా నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. పెరుగు పూర్తిగా తయారు కాకముందు తినడం మంచిది కాదని, అది జీర్ణ సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఇక పుల్లగా అయిన పెరుగును తిన్నా జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

పెరుగు పూర్తిగా తయారైన తర్వాత పుల్లగా కాకముందే తినాలని సూచిస్తున్నారు. ఎక్కువ పుల్లగా మారిన పెరుగు గ్యాస్టిక్ సమస్యలకు కారణమవుతుందని, దానివల్ల కడుపులో మంట వస్తుందని, దీనితో పిత్త సమస్యలు కూడా చోటుచేసుకుంటాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. పొరపాటున కూడా రాత్రిపూట పెరుగు తినడం చేయవద్దని చెబుతున్నారు. ఇక వేడిగా ఉన్న పదార్థాలతో పెరుగును తినడం హాని చేస్తుందని, పుల్లటి పండ్లతో కలిపి పెరుగును తినకూడదని చెబుతున్నారు. పుల్లటి పండ్లను పెరుగును కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

health tips: curd is healthy.. but it is dangerous to eat with some food items!!

ఇక ఇదే సమయంలో చేపలతో కూడా పెరుగును కలిపి తినకూడదని చెబుతున్నారు. చేపల కూర తిన్న సమయంలో పొరపాటున కూడా పెరుగును తినొద్దని సూచిస్తున్నారు. పెరుగును భోజనం చేసిన చివరలో ఆహారంలో భాగంగా తీసుకునే దానికంటే, దానిని ద్రవ రూపంలోకి మార్చి మజ్జిగగా తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

పెరుగు వాడడం వల్ల జ్వరం, విరేచనాలు వంటి సమస్యలకు బాగా పనిచేస్తుందని, నిద్రలేమికి, గుండె సమస్యలు ఉన్నవారికి, మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారికి, అమెనోరియా బాధితులకు, గర్భిణీలకు పెరుగు బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇక మధుమేహం ఉన్నవారు, చర్మ సమస్యలు ఉన్నవారు, నోరు, గొంతు సమస్యలు ఉన్నవారు, రక్తస్రావ సమస్యలు ఉన్నవారు ,దగ్గు వంటి ఇతర సమస్యలు ఉన్నవారు పెరుగును తీసుకునే ముందు వైద్యులను కలిసి వారి సలహా మేరకే పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+