డబ్బు ఖర్చు లేకుండా.. ఇలా బరువు తగ్గండి.. లైట్ గా ఫీలవ్వండి!
చాలామంది బరువు తగ్గడం కోసం తెగ తంటాలు పడుతుంటారు. విపరీతంగా బరువు పెరిగామని తగ్గడం కోసం జిమ్ ల వెంట, వెయిట్ రిడక్షన్ సెంటర్ల వెంట పరుగులు పెడుతున్నారు. అయితే అవేవీ అవసరం లేకుండా రూపాయి ఖర్చు కూడా లేకుండా బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి బరువు తగ్గాలంటే క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవన విధానం ఉంటే సరిపోతుంది.
బరువు ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి
ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లను తాగి ఆ తర్వాత ఒక గంట సేపు వాకింగ్ చేసినా, లేదా ఒక ముప్పావు గంట మనకు తెలిసిన ఎక్సర్సైజులు, వ్యాయామం, యోగా చేసిన ఫలితం ఉంటుంది. మనకు మనం స్వయంగా ప్రతిరోజు ఉదయం ఇలా అలవాటు చేసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది .

ఆహారం విషయంలో జాగ్రత్త
ఇక బరువు తగ్గాలని భావించేవారు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినకుండా ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారాలను తింటే మంచిది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు అన్నానికి బదులుగా తృణధాన్యాలను వండుకు తింటే ప్రయోజనం ఉంటుంది . బరువు తగ్గాలంటే స్వీట్లు తినకుండా ఉండడం మంచిది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
బరువు తగ్గాలంటే ఇవి తినొద్దు
ప్రతిరోజు రాత్రి 7 గంటల్లోపు డిన్నర్ పూర్తి చేయడం కూడా మంచిది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటి వాటిని కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. ఈజీగా బరువు తగ్గాలంటే శరీరానికి అవసరమైన వాటర్ ని కూడా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలసేపు నిద్ర పోవాలి. వీటితో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
ఈ నియమాలతో అధిక బరువుకు చెక్
కనుక బరువు తగ్గాలి అని భావించేవారు తప్పనిసరిగా ఈ నియమాలను పాటిస్తే, ఈ ఆహారపు అలవాట్లను చేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా బరువు తగ్గే ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications