health tips: ఆహారానికి చర్మ ఆరోగ్యానికి లింక్; చర్మ సంరక్షణకు ఈ ఆహారాలు బెస్ట్!!
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, చర్మ ఆరోగ్యం కూడా సాధ్యమవుతుంది. మనం తీసుకునే ఆహారం మన శరీరంలోని వివిధ అవయవాలనే కాకుండా చర్మం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక చర్మాన్ని సంరక్షించుకోవాలి అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలతో చర్మ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం.

ఆహారానికి చర్మ ఆరోగ్యానికి లింక్
సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. చర్మ సౌందర్యం కోసం మనం తీసుకునే ఆహారం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. మనం తీసుకునే ఆహారం ప్రభావం మన చర్మంపై కచ్చితంగా ఉంటుందని, పోషకాహార లోపం వస్తే చర్మం పై మొటిమలు, ముడతలు రావడం, శరీరంపై పొలుసులుగా రావడం, జుట్టు రాలిపోవడం వంటి అనేక సమస్యలు వేధిస్తాయని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. అందుకే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

మన చర్మ సంరక్షణ కోసం ఇవి చాలా ఉపయోగం
ఇక అటువంటి ఆహారాల్లో ముఖ్యమైన వాటిని గురించి చెప్పుకుంటే మనం తీసుకునే కూరగాయలలో టమాటాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు. టమాటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. టమాటాలు లైకోపిన్ తో సహా ప్రధాన కెరోటినాయిడ్స్ లను కలిగి ఉంటాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ముడతలు రాకుండా చూడడానికి సహాయపడతాయి.

చర్మ సమస్యలు తగ్గాలంటే ఇది ఆహారంలో కంపల్సరీ
ఇక మన మన ఆహారంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన వాటిలో నిత్యం పెరుగును తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలలో పెరుగును చేర్చుకోవడం వల్ల పెరుగు చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పెరుగులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జీ ప్రభావాలు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఏవైనా చర్మ సమస్యలు వచ్చినా వాటిని తగ్గించడానికి పెరుగు ఎంతగానో దోహదపడుతుంది.

విటమిన్ సీ ఉండే పండ్లతో బోలెడు ప్రయోజనాలు
ఇక చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. బత్తాయి, నారింజ, స్ట్రాబెర్రీలు, యాపిల్స్, పుచ్చకాయలు వంటి పండ్లను రోజూ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా బయో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం
ఉల్లిపాయలు, అవకాడో, పొద్దుతిరుగుడు గింజలు, వాల్ నట్స్, డార్క్ చాక్లెట్లు, గ్రీన్ టీ, ఎర్ర ద్రాక్ష, స్వీట్ పొటాటో లు, సాల్మన్ చేపలు వంటి ఆహార పదార్థాలలోనూ మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మెండుగా ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల కూడా చర్మ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు అని చెబుతున్నారు. మొత్తానికి మనం మన స్కిన్ ను కాపాడుకోవాలన్నా కూడా మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే మార్గమని డెర్మటాలజిస్ట్ ల సూచన.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications