health tips: కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు ట్రై చెయ్యండి.. సూపర్ రిలీఫ్!!
చాలామందికి కడుపులో మంట తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఏం చేసినా కడుపులో మంట తగ్గదు. ఏది తినలేక, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేక తీవ్ర ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. కడుపులో మంటతో పాటు గ్యాస్ సమస్య కూడా బాధిస్తుంది. కడుపు ఉబ్బరంగా మారి ఏం తినాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వారి కడుపులో మంట తగ్గడం కోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

కడుపులో మంటకు కారణం ఇదే..
సహజంగా కడుపులో మంట ఎసిడిటీ వల్ల వస్తుంది. స్పైసీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ వల్ల, విపరీతంగా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చి కడుపులో మంట గా ఉంటుంది. కొందరు పని ఒత్తిడిలో పడి సమయానికి ఆహారం తీసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు కూడా ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కడుపులో మంటగా ఉంటే పరిస్థితి ఇలా
ఇక కడుపులో మంట గా ఉన్న సమయంలో ఏ ఆహారం తీసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. కొందరు ఆహారం తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అయితే కడుపులో మంటతో బాధపడే వారు త్వరగా ఉపశమనం పొందాలంటే ముఖ్యంగా భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకూడదని సూచిస్తున్నారు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినటం మంచిది కాదని అంటున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కడుపులో మంట తగ్గించటానికి నేచురల్ రెమిడీస్ ఇవే
అంతేకాదు ఎసిడిటీని తగ్గించడానికి రోజూ నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. బెల్లం కూడా ఎసిడిటీని తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తులసి ఆకులను తినడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుందని చెబుతున్నారు. బాదం పప్పులతో ఎసిడిటీ నుండి కాస్త రిలీఫ్ లభిస్తుందని సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కూడా ఎసిడిటి తగ్గుతుందని, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్ లు తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు కడుపులో మంటగా ఉన్నప్పుడు అరటిపండు తింటే కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

చిన్న చిన్న చిట్కాలతో కడుపులో మంటకు చెక్ పెట్టండి
పెరుగులో రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే మంట నుండి ఉపశమనం లభిస్తుందని, కీర దోసకాయ తినడం గాని, కీరదోస జ్యూస్ ను త్రాగడం గాని చేస్తే కడుపులో మంట తగ్గి కాస్త కడుపు చల్లగా మారుతుందని చెబుతున్నారు. కడుపులో మంటను సహజంగా తగ్గించడంలో అవకాడో ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో వీలైనంత వరకూ మసాలాలతో తయారు చేసిన పదార్థాలు, వేపుడు పదార్థాలు, ఊరగాయ పచ్చళ్ళు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications