వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: కిడ్నీలు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండాలంటే చెయ్యాల్సినవి ఇవే!!

|
Google Oneindia TeluguNews

కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీలు దెబ్బతినకుండా ఉండటం కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? రోజూ మనం ఎంత త్రాగు నీరు తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి? వంటి అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

health tips: వేపాకు చేదుతో జీవితంలో తియ్యదనం.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే!!health tips: వేపాకు చేదుతో జీవితంలో తియ్యదనం.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే!!

 కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త

కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త


ప్రస్తుతం చాలామంది జీవనశైలి మార్పుల కారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు రావడం, కిడ్నీలు పాడుకావడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రధానంగా మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మానవ జీవితంలో ముఖ్య పాత్ర పోషించే కిడ్నీల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం పైన ప్రధానంగా దృష్టి సారించాలి.

కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ ఆహారం తీసుకోవటం బెస్ట్

కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ ఆహారం తీసుకోవటం బెస్ట్


ఇక ఆ విషయాల వివరాల్లోకి వెళితే కిడ్నీలు దెబ్బతినకుండా విటమిన్ బి6 ఉండే ఆహారాలను తీసుకోవాలి. చేపలు, శనగలు, లివర్, ఆలు వంటి ఆహారాలు, మెగ్నీషియం ఎక్కువగా ఉండే కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసకృత్తులు తక్కువగా తీసుకోవాలి. టమాటా మరియు పాలకూర తో కిడ్నీలో రాళ్లు వస్తాయని అనుమానం ఉన్న వారు వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది.

ఆహారంలో వీటిని తగ్గించాలి

ఆహారంలో వీటిని తగ్గించాలి


రోజువారీ వంటల్లో అల్లం, పసుపు తప్పనిసరిగా వాడుకోవాలి. కొత్తిమీరను కూడా రోజువారీ ఆహారంలో తీసుకుంటే కొత్తిమీర కు రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను నిలువరించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా బీన్స్, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బెర్రీ ఫ్రూట్స్, పెరుగు, కిడ్నీలకు మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడితే చాలా మంచి జరుగుతుంది. ఆహారంలో కారం, మసాలాలను, అధికంగా ఉప్పును తగ్గించుకోవాలి. సరైన పాళ్ళల్లో ప్రోటీన్లు మన శరీరానికి అందేలా చూసుకోవడం చేయాలి

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు చెయ్యండి

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు చెయ్యండి


అంతేకాదు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సోడా, గ్యాస్ ఉన్న డ్రింకులను ఎక్కువగా తాగకూడదు. ప్రతిరోజు మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. ఆహారంలో మాత్రం ఉప్పును కచ్చితంగా తగ్గించాలి. పెయిన్ కిల్లర్స్ ను తరచూ వాడకూడదు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, సరైన సమయంలో రోజు నిద్రపోవడం, ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిది. ఇక ఎప్పుడూ మూత్రాన్ని ఆపుకోకూడదు. చాలామంది గంటల తరబడి మూత్రాన్ని ఆపుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని అలా చేయడం కిడ్నీలను పాడు చేస్తుందని చెబుతారు.

 కిడ్నీల ఆరోగ్యం కోసం సరైన జీవన విధానం ఎంతో అవసరం

కిడ్నీల ఆరోగ్యం కోసం సరైన జీవన విధానం ఎంతో అవసరం

కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకుంటే మీ కిడ్నీలు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ సమస్య మొదట ఎలాంటి సంకేతాలు లేకుండా వచ్చినా తర్వాత మన జీవితాన్ని ఆస్పత్రి పాలు చేసి బ్రతుకును దుర్భరం చేస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that in order to stay healthy without damaging the kidneys, should eat foods rich in vitamin B6 and magnesium, drink more water, and take some precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X