health tips: బరువు తగ్గించే నాలుగు సూపర్ డ్రింక్స్ ఇవే!!

విపరీతంగా బరువు ఉన్నామని చాలామంది తెగ బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహారం, వ్యాయామం విషయంలో బోలెడు నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఉదయం లేవగానే కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రకాల పానీయాలతో ఒబేసిటీ నుండి బయటపడవచ్చని సూచిస్తున్నారు. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల క్రమంగా ఒబేసిటీ తగ్గుతుందని, శరీరంలోని కొవ్వును నిమ్మరసం, తేనే తగ్గిస్తాయని చెబుతున్నారు. నిమ్మరసంలో పెక్టిన్ ఉండడం వల్ల ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

health tips:

ఉదయం పరగడుపున ఒక గ్లాసు సోంపు నీరు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. సోంపు వాటర్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది .అంతేకాదు అనేక చర్మ సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారంగా కనిపిస్తుంది. ఇది బరువును కూడా బాగా తగ్గిస్తుంది. ఒబేసిటీ బాధ నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది.

ప్రతిరోజు ఉదయం పరగడుపున పచ్చి పసుపును తీసుకుని కొద్దిగా గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. పసుపు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

health tips:

ప్రతిరోజు ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో చక్కెర పొరపాటున కూడా కలుపుకోకూడదు. గ్రీన్ టీ తాగడం వల్ల ఒబేసిటి సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది. కనుక బరువు తగ్గాలని భావించేవారు క్రమం తప్పకుండా ఈ పానీయాలను తాగండి. ఆపై బరువు విషయంలో రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవ్వటం ఖాయం.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+