Helath tips: కాఫీని వీరు అస్సలే తాగొద్దు.. తాగితే డేంజర్ లో హెల్త్!!
చాలామందికి ప్రతిరోజూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీలో కెఫీన్ అండ్ మూలకం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. తరచూ కాఫీ తాగితే దీనివల్ల మన ఆరోగ్యం డేంజర్ లో పడుతుంది. అయితే కాఫీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగడం, వారిని మరింత డేంజర్ లోకి నెడుతుంది. ఏ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాఫీ తాగకూడదు అనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
అధిక రక్తపోటు బాధితులు కాఫీని తాగకూడదు. ఒకవేళ మీరు కాఫీని తాగితే మీ హైబీపీని ఇది మరింత పెంచుతుంది. కాబట్టి హాయ్ బీపీతో బాధపడేవారు కాఫీకి దూరంగా ఉండాలి. డయాబెటిస్ తో బాధపడేవారు కూడా కాఫీ తాగడానికి దూరంగా ఉండాలి. తరచూ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ బాధితుల్లో షుగర్ లెవెల్స్ పెరిగి సమస్య మరింత తీవ్రతరమవుతుంది.

గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం మానుకోవాలి. గర్భిణీ స్త్రీలు కాఫీని ఎక్కువ తాగినట్లయితే వారు రిస్క్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు కాఫీ తాగినా చాలా పరిమిత మోతాదులో తాగాలి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒత్తిడికి గురైనప్పుడు చాలామంది కాఫీ తాగుతారు. దీనివల్ల వాళ్ళు రిలాక్స్ పొందినట్టుగా భావిస్తారు.
అయితే ఒత్తిడికి తరచూ గురవుతున్నామని ఎక్కువగా కాఫీ తాగితే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలో ఉండదు. దీనివల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. తరచూ మూత్ర విసర్జన చేసే వారు కాఫీ తాగకూడదు. తరచుగా మూత్ర విసర్జన చేయడం అనారోగ్య లక్షణం. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు కాఫీ ని ఎక్కువగా తాగకుండా ఉంటే మంచిది.
గుండె జబ్బులతో బాధపడేవారు కాఫీని తాగకూడదు. కాఫీ రక్తపోటును పెంచుతుంది కాబట్టి గుండె సమస్యలను ఇది ఎక్కువగా పెంచే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కాఫీ తాగకుండా ఉంటేనే మంచిది. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications