ఈ అలవాట్లతో షుగర్ ఫ్రీ లైఫ్, నిర్లక్ష్యం చేయద్దు..!!

డయాబెటిస్. ఈ సమస్య ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అనేక మందిని వేధిస్తోంది. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. డయాబెటీస్ వచ్చిన తరువాత చికిత్సకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో.. రాకముందే జాగ్రత్తల ద్వారా నివారించే అవకాశాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు .. ఆహారంలో జాగ్రత్తల ద్వారా మధుమేహం సాధ్యమైనంత వరకు దూరంగా చేయవచ్చు. అయితే, షుగరు విషయంలో వైద్యుల సూచనలే అన్నింటి కంటే ముఖ్యమైనవి.

డయాబెటిస్ గతం కంటే వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నట్లు అంచనా. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారిలో సగం మందికి దాని గురించి తెలియదు. జీవనశైలిలో మార్పులతో చాలా వరకు ఈ వ్యాధిని నివారించవచ్చు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుపడి డయాబెటిస్ వస్తుంది. కొందరికి ప్రి డయాబెటిస్ అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరణ అవుతుంది. ఇది డయాబెటిస్ రావడానికి ముందు దశ. ఇది ఇలాగే కొనసాగితే మధుమేహానికి దారి తీస్తుంది.

healthy-habits-to-help-you-prevent-or-manage-your-type-2-diabetes-is-here

డయాబెటిస్‌లో సాధారణంగా అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం, ముఖ్యంగా రాత్రివేళల్లో, బాగా అలసిపోవడం, బరువు తగ్గిపోవడం, తరచుగా పుండ్లు కావడం, చూపు స్పష్టంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యకర ఆహారం, క్రియాశీల జీవన విధానంతో రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచవచ్చు. చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఆహారాల బదులుగా సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవడం ఇందుకు మొదటి మెట్టు. రోజువారీ వ్యాయామం శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా.. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడి పెరిగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ నీరు తాగే వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. పొగ తాగడం, మద్యం సేవించడం మానుకోవాలి. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో పాటు వీటిని పాటించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన జీవన శైలితో డయాబెటీస్ ఫ్రీ లైఫ్ కొనసాగించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+