Intermittent Fasting: అరకొర ఉపవాసాలతో హార్ట్ స్ట్రోక్ వస్తుందా ? ప్రభుత్వ డాక్టర్ క్లారిటీ !
ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రసార మాధ్యమాల్లో అరకొర ఉపవాసాలపై (Intermittent Fasting)ఎక్కువగా చర్చ జరుగుతోంది. అంటే నిర్ధిష్ట సమయం పెట్టుకుని అప్పుడు మాత్రమే ఉపవాసం చేసి మిగతా సమయాల్లో తినేయడం అన్నమాట. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉందన్న ప్రచారాల నేపథ్యంలో చాలా మంది ఈ అరకొర ఉపవాసాల వల్ల గుండెజబ్బులు వస్తాయంటూ మరో వాదనను పలువురు తెరపైకి తెస్తున్నారు. దీనిపై కర్నూలు జీజీహెచ్ లో గుండె, ఊపిరితిత్తుల సర్జన్ గా పనిచేస్తున్న చింతా ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
అసలు మనం తీసుకునే ఆహారం ఎలా కడుపులోకి ప్రయాణం చేసి జీర్ణం అవుతుందో ఆయన ముందుగా చెప్పారు. మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. లాలాజలంలో టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. తరువాత మన జీర్ణాశయంలో ఆహారం 4 గంటల పాటు ఉండి జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాలేయం నుంచి వచ్చే కాలేయ రసాలు బైల్ యాసిడ్స్, క్లోమం నుంచి వచ్చే ఎంజైంలు అన్ని ఈ ఆహారంతో కలుస్తాయి. ఈ ప్రాసెస్ అంతా జరిగి జీర్ణాశయం నుంచి ఆహారం బయటకు వెళ్లడానికి 6 గంటలు పడుతుంది.

ఆ తర్వాత జీర్ణాశయం నుంచి ఆహారం కిందకు వెళ్ళగానే ఇక మళ్లీ ఆకలి అనిపిస్తే తినాలని అనుకుంటాం. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. జీర్ణ వ్యవస్థలో అసలైన ఆహారం జీర్ణ ప్రక్రియ ఆ 6 గంటల తర్వాతే ప్రారంభమవుతుంది. దీనిని ఇంటర్ డైజెస్టివ్ దశ అంటారు. ఈ ఆహారం జీర్ణ కోశం నుంచి కిందకు వెళ్లిన తర్వాత దాదాపు 3 మీటర్ల పొడుగున ఉండే చిన్న ప్రేవుల ద్వారా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ఆహారంలో ఉన్న పదార్థాల్ని గ్లూకోజ్ గానూ ప్రోటీన్ లాగానే విభజించి వాటిని చిన్న ప్రేవులలో ఉన్న విల్లై ద్వారా విలీనం చేసుకొని అవి మళ్లీ రక్తంలో కలిసి కాలేయానికి వెళ్లి కొంత స్టోర్ అయ్యి మనకు శక్తినిస్తాయి.
తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్లి వీలైనంత నీటిని పీల్చుకొని విసర్జన అవుతాయి. ఇలా జీర్ణం కావడానికి మొత్తం 24 గంటల దాకా పడుతుంది. మన శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఇంటర్ డైజెస్టివ్ ఫేస్ అనే 16 గంటల సమయమే. మనం చాలామంది జీర్ణకోశంలో ఆహారం ఉంటేనే మనం శక్తి వస్తుంది అని అనుకుంటాం అది తప్పు. కాబట్టి అరకొర ఉపవాసాల వల్ల గుండె జబ్బులు వస్తాయన్న వాదనలో అసలు పస లేదని ఆయన అంటున్నారు.
చైనాలో ఓ 200 మందికి ఫోన్ చేసి ప్రశ్నలడిగి, అవే ప్రశ్నలు అమెరికాలో ఉండే 200 మందికి అడిగి ఇక గుండె జబ్బులు వస్తాయి అని ప్రచారం చేస్తున్నారని, కానీ వీటికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు జతపరచలేదని గుర్తుచేసారు. ఎలాంటి అధ్యయనం, ఆధారాలు కానీ లేవన్నారు. వాస్తవానికి చాలా జంతువులు పక్షులు అన్నీ కూడా ఒక పూటనే తింటాయని, మనుషుల మాదిరి చాలాసార్లు తినవని తెలిపారు. తక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల పేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యి ఇంకా బాగా శరీరంలోకి అబ్సార్బ్ అవుతుందన్నారు.
కావున అరకొర ఉఫవాసం అనేది వాస్తవ ఉపవాసం కాదని మామూలుగా చేయాల్సిన పనే అంటున్నారు. మనం ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నామని, శరీర నిర్మాణంలో జీర్ణాశయం అనేది ఒక స్టోరేజ్ పాయింట్ అని, పాత కాలంలో ఆహారం ఎప్పుడూ దొరకదు కాబట్టి మనకు జీర్ణాశయం అనేది పరిణామ క్రమంలో డెవలప్ అయిందంటున్నారు. అంటే మనం ఆహారాన్ని ఒకేసారి తీసుకొని దానిని నిదానంగా కిందికి పంపిస్తూ జీర్ణం జరగడానికి అలవాటు పడిపోయామన్నారు. కానీ ఈ మారిన నవీన యుగంలో ఆహారాన్ని బయట స్టోరేజ్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం దొరుకుతుందన్నారు. అందుకని ఎక్కువసార్లు మనం తినాల్సిన అవసరం లేదంటున్నారు.
-
బడ్జెట్లో స్మూతీ మేకర్స్ కావాలా.. బెస్ట్ డీల్స్ ఇవే ?? -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications