Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ హోమ్ మేడ్ సీరమ్స్ తో జుట్టు ఒత్తుగా, పొడవుగా.. తయారుచేసుకోవటం సింపుల్

ప్రస్తుతం కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. జుట్టు పలచబడటం, జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం ప్రధానంగా అందరినీ వేధిస్తుంది. ఇక జుట్టు ఆరోగ్యం కోసం బయట హెయిర్ ప్రొడక్ట్స్ కొనుక్కున్న వారు కొన్ని సందర్భాలలో వాటి వల్ల కూడా జుట్టు పాడవడాన్ని గుర్తిస్తున్నారు.

జుట్టు ఆరోగ్యం కోసం హోం మేడ్ హెయిర్ సీరమ్స్

జుట్టు ఊరికే పొడిబారిపోవడం, లేదా జిడ్డుగా తయారు కావడం, నిగారింపు తగ్గడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యల నుండి బయటపడడానికి మనం ఇంట్లోనే హెయిర్ సీరమ్ లను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. మరి ఆ హెయిర్ సీరమ్ లు ఏమిటో తెలుసుకుందాం.

Homemade Hair Serums For Frizz And Shine Simple home Mixes are better than market serums

కొబ్బరి నూనె అలోవెరా సీరమ్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు కొబ్బరి నూనె అలోవెరా సీరమ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి జుట్టు చివర్లకు అప్లై చేస్తే డ్రైనెస్ తగ్గి జుట్టు సాఫ్ట్ గా మారుతుంది. అలోవెరా తల చర్మాన్ని శాంతింప చేసి, జుట్టుకు కావలసిన తేమను అందిస్తుంది.

బాదం నూనె విటమిన్ ఈ సీరమ్

బాదం నూనె విటమిన్ ఈ సీరమ్ జుట్టు మెరుపును పెంచుతుంది. బాదం నూనెలో ఒక విటమిన్ E క్యాప్సూల్ నూనె కలిపి కొద్దిగా జుట్టు చివర్లకు రాస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇది జుట్టు చివర్లు చిట్లిపోవడం సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది.

రోజ్ వాటర్–గ్లిసరిన్ సీరమ్

మన ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన మరొక సీరమ్ రోజ్ వాటర్–గ్లిసరిన్ సీరమ్. ఈ సీరమ్ జుట్టును అదనంగా వచ్చే ఆయిల్ ను తగ్గించి జుట్టు సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. గ్లిజరిన్ తేమను నిలిపి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది కూడా మనం ఇంట్లో తయారుచేసుకుని వాడగలిగే ఒక సీరమ్.

ఈ సీరమ్స్ బెస్ట్ కానీ

అయితే ఇంట్లోనే తయారు చేసుకునే సీరమ్ లు అయినప్పటికీ వీటిని ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ముఖ్యంగా స్కాల్ప్ కు కాకుండా, జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి. ఈ సీరమ్ ను వారానికి రెండు లేదా మూడుసార్లు వాడితే సరిపోతుంది. సహజ పదార్థాలతో చేసిన ఈ సీరమ్స్ మార్కెట్లో దొరికే సీరమ్స్ కన్నా చాలా మంచివి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+