ఒక టూత్ బ్రష్ ఎన్నిరోజులు వాడాలో తెలుసా?
మన పూర్వీకులు ఉదయం నిద్ర లేవగానే వేపచెట్టు నుంచి ఒక పుల్ల విరిచి పళ్లు తోముకునేవారు. దాన్ని గట్టిగా నమిలి తోమేవారు. అంటే వారి పళ్లు, దంతాలు అంత దృఢంగా ఉండేవి. క్రమేణా ఆ గట్టిదనాన్ని ఇప్పటితరం వారు కోల్పోతున్నారు. జన్యుపరంగా కావొచ్చు.. అలవాట్లు పరంగా కావొచ్చు.. వేప పుల్లతో తోముకునేంత పటిష్టత పళ్లకు ఉండటంలేదు. అందుకే అందరూ టూత్ బ్రష్ వాడుతున్నారు. క్లోరిన్ ఎక్కువగా ఉండే పేస్ట్ ను బ్రష్ పై వేసుకొని పళ్లు తోముకుంటున్నామని అనుకుంటున్నాం కానీ ఆ క్లోరినే చాలా డేంజర్. టూత్ బ్రష్ ను ఎన్నిరోజులు వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
బ్రిసిల్స్ మృదువుగా మారితే నిరుపయోగం
ఒక టూత్ బ్రష్‌ను సాధారణంగా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. మీ దంతాల ఆరోగ్యం, బ్రష్‌ను ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై ఆధారపడి కొంచెం మారవచ్చు. బ్రష్ ను ఎక్కువ కాలం వాడుతుంటే కాలక్రమంలో, టూత్ బ్రష్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి మళ్ళీ నోటిలోకి వెళ్లి దంతాలు, చిగుళ్ళ సమస్యలకు కారణమవుతాయి. తరచూ ఒకే బ్రష్ ఉపయోగించడం వల్ల బ్రిస్సిల్స్ అంటే బ్రష్‌లోని రోమాలు మృదువుగా మారి, తగినంతగా పళ్ళను శుభ్రం చేయలేవు. బ్రిస్సిల్స్ దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసి, దంతాలు సున్నితంగా మారేలా చేస్తాయి.

ఆరునెలలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి
బ్రిస్సిల్స్ వంగిపోయినట్లు కనిపిస్తే వెంటనే మార్చాలి. బ్రష్‌ను శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్గంధం వస్తే అది మార్చాల్సిన సమయం అని అర్థం చేసుకోవాలి.
జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు బ్రష్‌ను మార్చడం మంచిది. అలవాటు చేసుకున్నట్లయితే ప్రతి 3-4 నెలలకు క్రొత్త బ్రష్‌ను కొనుగోలు చేయడం ఎవరూ మరచిపోరు. బ్రష్ కొనుగోలు చేసే సమయంలో చాలా మృదువుగా లేదా చాలా గట్టిగా ఉండే బ్రిస్సిల్స్ ఎంచుకోకండి. మధ్యస్థంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది. ఏదిపడితే అది కాకుండా మీ నోటికి అనుకూలంగా ఉండే ఆకారంలో బ్రష్‌ను ఎంచుకోండి. ఏ రకమైన బ్రష్‌ను ఎంచుకోవాలో మీ దంతవైద్యుని సలహా తీసుకోవడం మంచిది. బ్రష్‌ను మార్చడంతో పాటు, రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం, దంతాలకు ఫ్లోస్ చేయడం, ఆరు నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించడం వంటి అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క.












Click it and Unblock the Notifications