ఇలా చేయండి.. అలా బరువు తగ్గండి.. సింపుల్

చాలామంది నాలుకను అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది.. ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు. వెంటనే బరువు పెరుగుతారు. ఆ బరువు తగ్గడానికి ఏం చేయాలో అర్థంకాక అయోమయానికి గురవుతుంటారు. వ్యాయామం చేసినా ఆకలి ఎక్కువగా వేసి ఎక్కువగా తినేస్తారు. డైట్ పాటించినా శాస్త్రీయంగా లేక అనారోగ్యానికి గురయ్యేవారు కూడా ఉన్నారు. అలా కాకుండా ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా బరువు తగ్గుతారు.. స్లిమ్ గా తయారవుతారు.

ఊబకాయంవల్ల తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొట్ట ఎక్కువగా ఉంటూ అంద విహీనంగా కనిపిస్తారు. ప్రతిరోజు వ్యాయామం చేయడంవల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో కొంతమంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతుంటారు. అలా కాకుండా బరువు తగ్గాలనుకునేవారు ముందు ప్రశాంతంగా నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర ఉండాలి.

bellyfat

బరువును నియంత్రించుకునే క్రమంలో తప్పనిసరిగా ప్రొటీన్లు, ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. కార్యాలయాల్లోకానీ, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే అలవాటున్నవారు లావుగా తయారవుతారు. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తీవ్రంగా పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం మానేయాలి. ప్రతి రోజు గ్రీన్‌ టీ రెండుసార్లన్నా తాగుతుండటంవల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

చాలా మంది మంచినీటిని చాలా తక్కువగా తీసుకుంటుంటారు. కానీ బరువు తగ్గాలనుకునేవారు మంచినీటిని ఎక్కువగా తీసుకుంటుండాలి. ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ముందుగా మంచినీరు తాగాలి. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి కొద్దిమోతాదులోనే తినగలుగుతారు. బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. లస్సీ, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం వంటి ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు తీసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+