ఈ పండును రోజూ తింటే ఆరోగ్యంపైన, అందంపైనా చేస్తుంది మాయాజాలం!!
ప్రకృతిలో దొరికే పండ్లు, కూరగాయలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం మాత్రమే కాదు కొన్ని పండ్లు మన చర్మానికి నిగారింపును తెచ్చి మన అందం ఇనుమడింపజేసేలా పనిచేస్తాయి. అటువంటి పండ్లలో నారింజ పండు ఒకటి. నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
నారింజ పండులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజు నారింజ పండ్లను తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాదు, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.

నారింజ పండు శరీరానికి రోగనిరోధక శక్తిని అందించి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నారింజ పండులో ఉండే పోషకాలు మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పరిమిత పరిమాణంలో రోజు నారింజను తీసుకోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక సమస్యలకు చెక్ పడుతుంది.
రోజు నారింజ పండ్లను తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలతో పాటు అనేక వ్యాధుల బారి నుండి బయట పడతాం. రోగ నిరోధక శక్తి పెరిగి ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా రాకుండా ఉంటుంది. నారింజ పండులో విటమిన్ సి ఉండడంవల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది.
నారింజలో ఉండే పొటాషియం మరియు ఇతర ఖనిజాల వల్ల రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉన్నప్పుడు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు నారింజ పండును పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరం బలపడడం తో పాటు అలసట, బలహీనత తగ్గుతుంది.
నారింజ పండ్లతో శరీరానికి కావలసిన ఎనర్జీ లభిస్తుంది. ఇక ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే నారింజ పండును ప్రతిరోజు ఆహారంలో భాగంగా పరిమిత మోతాదులో చేసుకోండి.. ఆపై ఫలితాన్ని మీరే చూడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications