జాన్వీ కపూర్ ఇష్టపడే రాయలసీమ స్పెషల్​ రెసిపీ.. ఇలా ఈజీగా చేసుకోండి..

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌ లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాలీవుడ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టిందీ బ్యూటీ. అయితే ఇటీవల ఓ షో లో పాల్గొన్న జాన్వీ తనకు రాయలసీమ ఫేమస్ రెసిపీ అయిన రాగి ముద్ద చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

మరి ఫేమస్ రెసిపీ అయిన రాగి ముద్దను ఎలా తయారు చేయాలి..? కావల్సిన పదార్థాలు ఏంటి..? రాగి ముద్ద తయారీకి ముందుగా రేషన్​ బియ్యం రెండు కప్పులు, నీళ్లు తగినన్ని, ఉప్పు రుచికి సరిపడా, రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా రేషన్​ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి.

JanhviKapoor bollywood actress Favorite Rayalaseema Dish Super Easy Authentic Recipe You Must Try

నీళ్లు బాగా మరుగుతున్న క్రమంలో అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే నానబెట్టిన రేషన్​ బియ్యం నీళ్లు లేకుండా వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత అందులో రాగి పిండి వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఒకే దగ్గర కాకుండా అన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.

అలా కొద్దిసేపటి తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పిండి, అన్నం మొత్తం కలిసేలా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు తడి లేదా నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ రాయలసీమ స్పెషల్​ రెసిపీ రెడీ అయినట్టే.. దీన్ని చికెన్ కర్రీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+