నిమ్మరసం ఖాళీ కడుపుతో తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక!

ఉదయం ఖాళీ కడుపుతో వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మనలో చాలామందికి రోజువారీ అలవాటు. బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, శరీరం డీటాక్స్ చేయడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగటం మంచిది కాదంటున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం ఆరోగ్యవంతమైన వ్యక్తులలో కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఈ సమస్యలు

నిమ్మకాయలోని ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలం ఖాళీ కడుపుతో సేవించడం ఎముకల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇది శరీరంలో కాల్షియం స్థాయిని ప్రభావితం చేసి ఎముకల సాంద్రత తగ్గడానికి ఆస్టియోపోరోసిస్ కు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరియు వయసు మీరిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

lemon water Side Effects On health don t drink early morning lemon water health risks explained

ఉదయాన్నే నిమ్మరసం తాగితే దంతాలకు డేంజర్

ఉదయానే నిమ్మరసం తాగటం దంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. నిమ్మరసంలోని ఆమ్లం దంతాల ఎనామిల్ పొరను క్రమంగా కరిగించి, పళ్లు సున్నితం చేసి, పళ్ళ సెన్సిటివిటీ సమస్యలను పెంచుతుంది. రోజూ ఖాళీ కడుపుతో తాగేవారిలో దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయని డెంటిస్టులు చెప్తారు.

అతిగా ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఈ సమస్యలు

అతిగా నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో నీటి సమతుల్యం దెబ్బతింటుంది. ఆస్కార్బిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా నీటిని ఎక్కువగా విసర్జించడానికి కారణమవుతుంది. దీంతో నిర్జలీకరణ, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.జీర్ణ సంబంధిత సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి ఎసిడిటీ, మంట, గుండెల్లో నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి.

మూత్రపిండాలపై నిమ్మరసం ప్రభావం

కొంతమందిలో కడుపు అల్సర్ వంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక మోతాదులో నిమ్మరసం దీర్ఘకాలం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నిపుణులు చెప్తుంది ఇదే

నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే, కానీ ఖాళీ కడుపుతో కాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా భోజనంతో పాటు తక్కువ మోతాదులో తాగడం మంచిది. ఇప్పటికే ఎసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+