Heart Attack: చిన్న వయస్సులో గుండె పోటు ముప్పు.. ఇలా చేస్తే తప్పించుకోవచ్చు..!
గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో ఊబకాయం ఉన్నవారికి, వయస్సు ఎక్కువగా ఉన్నవారి గుండె పోటు వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏ వయస్సు వారికైనా హార్ట్ ఎటాక్ వస్తుంది. కరోనా తర్వాత చాలా చిన్న వయస్సువారు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

డ్యాన్స్ చేస్తూ
కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఓ పాఠశాల విద్యార్థిని కూడా గుండె పోటుకు గురయింది. తాజాగా ఓ కానిస్టేబుల్ జిమ్ వర్కౌట్ చేస్తూ కుప్పకూలిపోయాడు. దీన్ని బట్టి గుండెపోటు ఏ వయస్సు వారికైనా వస్తుందని అర్థం అవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం గుండె పోటు నుంచి కొంతైనా తప్పించుకోవచ్చు.

ధూమపానం
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, దాదాపు 25 శాతం మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు కొన్ని రకాల పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తేలింది. ధూమపానం వల్ల వచ్చే గుండె జబ్బులతో ఏటా 90,000 మంది మరణిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం వల్ల రక్త నాళాలను కుంచించుకుపోయి, గుండెపై అదనపు ఒత్తిడిని కలిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందట.

అధిక బరువు
ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎక్కువ బరువు ఉన్న యువకులు ఇతరులతో పోలిస్తే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉందట. అందుకే కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థులు తినొద్దని సూచిస్తున్నారు.

జీవనశైలి
ప్రస్తుతం చాలా మంది జీవనశైలి మారింది. అర్థరాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం. ఉదయం లేట్ లేవడం. ఇష్టమొచ్చినప్పుడు తినడం ఇవన్నీ గుండె పోటుకు దారి తీసే అవకాశం ఉందట.

గుండె పోటు వచ్చే ముందు లక్షణాలు
కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుందట. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుందట. కడుపులో గ్యాస్ పెరిగినట్లు, లేదా అసిడిటీగా అనిపిస్తుంది. గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తుందట. ఇలా అనిపించిన వెంటనే మనం ఆస్పత్రికి వెళ్తే ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications