మినప వడియాల పులుసు.. ఇలా చేస్తే అన్నం మెతుకు మిగలదు!
మినప వడియాల పులుసు అనేది ఆంధ్రా, తెలంగాణలో చాలా ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ వంటకం. పుల్లగా, కారంగా, అత్యంత రుచిగా ఉండే ఈ పులుసు అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. సరిగ్గా చేస్తే నిజంగానే అన్నం మెతుకు కూడా మిగలదు.
కావాల్సిన పదార్థాలు:
మినప వడియాలు - ఒక కప్పు
చింతపండు - పెద్ద నిమ్మకాయంత
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 4 నుంచి 5 కట్ చేసుకున్నవి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు- 2 రెమ్మలు,
జీలకర్ర మెంతుల పొడి- ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
పసుపు - 1/2 టీ స్పూన్,
కారం- 1 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి - తాలింపు కోసం
నూనె - 4 టేబుల్ స్పూన్స్

చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనే వేసి ఆ నూనెలో మినప వడియాలను వేపుకోండి. తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోండి. ఆపై చింతపండును నానబెట్టి రసం తీసుకోండి. బాణలిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చెయ్యండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపండి.
మినప వడియాల పులుసు ఇలా చేస్తే రుచి సూపర్
అందులో వేయించి పెట్టుకున్న వడియాలు వేసి కలపండి.పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి. చింతపండు రసం పోసి మరగనివ్వండి. పులుసు సన్నగా మరుగుతున్నప్పుడు అందులో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. వడియాలు పులుసు పీల్చుకుని మెత్తగా అవుతాయి.
ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేలా చేసే సూపర్ పులుసు
చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి దించేసుకోండి. ఈ పులుసు వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా చాలా బాగుంటుంది . ఈ పులుసులో మినప వడియాలు వేయటంతో రుచి మరింత పెరుగుతుంది. అన్నంతో ఈ పులుసు కలిపి తింటే ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తారు.













Click it and Unblock the Notifications