Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Obesity: ఆందోళనకరంగా చిన్నారులలో ఊబకాయం: కారణాలేంటి, నివారణా చర్యలేంటి? ఖచ్చితంగా తెలుసుకోండి!!

ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఊబకాయం అనేక రోగాలకు మూలం. ఇప్పుడు ఊబకాయం సమస్య పెద్దవారికే కాదు పిల్లలకు కూడా అతి పెద్ద సమస్యగా మారింది. దీర్ఘకాలిక సంక్లిష్ట పరిస్థితికి కారణమవుతోంది. పిల్లల్లో విపరీతంగా అధిక శరీర కొవ్వు పేరుకుపోవడంతో ఊబకాయం వస్తుంది.

పిల్లలలో ఊబకాయం సమస్య ఉంటే వారికి ఆస్తమా, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, డిప్రెషన్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 4.3 మిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఊబకాయం చిన్నారుల తీవ్ర అనారోగ్య సమస్యల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

Obesity in children know the causes and preventive measures

అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చిన్నారులకు ఊబకాయం సమస్య వస్తుంది. తక్కువ పోషకాలు ఉన్న, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని, కూల్ డ్రింక్స్ ను, స్నాక్స్ ను తీసుకోవడం వల్ల పిల్లలకు ఊబకాయం వస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం ఊబకాయానికి కారణమవుతుంది.

అంతేకాదు ఒకప్పుడు చిన్నారులు బయటకు వెళ్లి ఆటలు ఆడేవారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లలో, కంప్యూటర్ల ముందు కూర్చుని బయటకు వెళ్లి ఆటలు ఆడకపోవడం వల్ల, శారీరకంగా శ్రమ లేకపోవడం వల్ల పిల్లలు ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. ఇక పిల్లల్లో ఊబకాయానికి మరో ముఖ్యమైన కారణం జన్యుపరమైన అంశాలు. కుటుంబ చరిత్రలో ఊబకాయులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఊబకాయులుగా మారే అవకాశం ఉంటుంది.

పిల్లల్లో ఊబకాయం నివారించాలంటే వారిని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల విషయంలో ప్రోత్సహించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, తక్కువ కొవ్వు ఉన్న ఉత్పత్తులను పిల్లలు తినేలా ప్రోత్సహించాలి. కూల్ డ్రింక్స్ కు, జంక్ ఫుడ్, స్నాక్స్ కు పిల్లలను దూరంగా ఉంచాలి.

అంతేకాదు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ని ప్రోత్సహించాలి. క్రీడలు, డ్యాన్స్ చేయడం వంటి శారీరక శ్రమలో పిల్లలను పాల్గొనేలా చేయాలి. పిల్లలు తగినంత నిద్ర పోతున్నారా లేదా అనేది గమనించాలి. తగినంత నిద్ర పోవడం వల్ల కూడా ఊబకాయం సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+