పురుషుల వీర్యకణాలను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్!
ప్రస్తుత జీవితంలో ప్లాస్టిక్ లేకుండా రోజు గడవదు. అంతేకాదు.. మన శరీరంలో కూడా ఓ భాగంగా మారిపోయింది. మంచినీళ్ల సీసా, టీ కప్పు, భోజనం ప్లేట్.. ఇలా ఏదైనా అన్నీ ప్లాస్టిక్ తోనే ముడిపడిపోయాయి. మానవజాతి మనుగడకే ప్లాస్టిక్ పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్ లో ఉండే అతి చిన్న రూపమైన ప్లాస్టిక్ వ్యర్థ కణాలు గాలి, నీరు, ఆహారంద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు వంటి అన్ని అవయవాలపై ఇవి హానికర ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వీర్య నమూనాల్లో ప్లాస్టిక్ కణాలు
ఆహారపు అలవాట్లు మారడం, జీవనశైలి మారిపోవడంవల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటోంది. హానికరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతోంది. పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. స్పెర్మ్ సెల్స్ లో ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయని చైనా పరిశోధకులు కూడా తేల్చారు. చెనాలోని 36 మంది ఆరోగ్యవంతమైన యువకుల స్పెర్మ్ ను ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని నమూనాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొని వీరంతా షాక్ అయ్యారు.

పురుషులు దూరంగా ఉంటే మంచిది
మంచినీళ్ల సీసాలు, బ్యాగుల తయారీలో ఉపయోగించే పాలీ ఇథిలిన్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ స్టైరిన్ వంటి కణాలను పురుషుల వీర్యంలో గుర్తించారు. ఈ ప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తికి కీలకమైన స్పెర్మ్ కణాల కదలికలను అడ్డుకుంటున్నట్లు తేలింది. స్పెర్మ్ కణాల పెరుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలో పురుషుల సంతానోత్పత్తిపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. వీలైనంతమేరకు పురుషులు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications