గుడ్లు, మాంసం కన్నా ఈ పండ్లలోనే ప్రొటీన్లు ఎక్కువ
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అందుతుండాలి. అంతేకాదు.. మంచి డైట్ పాటించాలి. మాంసం, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే నాన్ వెజ్ తిననివారి కోసం వారు మాంసాహారం ద్వారా ఏవైతే కోల్పోతున్నారో వాటిని కొన్ని పండ్ల ద్వారా పొందొచ్చు. ప్రొటీన్ లోపంతో బాధపడేవారు ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి.
నారింజ పండు: రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది. కండరాలను బలపరిచే ప్రోటీన్ కూడా లభిస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటుండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడంవల్ల జలుబు, చెవి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. తరుచుగా వీటిని తింటుంటే యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు రావు.

జామ పండు: జామపండును పేదవారి పండుగా పిలుస్తారు. దీన్ని తీసుకోవడంవల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇందులో ప్రొటీన్లు ఉంటాయని చాలామందికి తెలియదు. తరిగిన జామపండ్లలో 4.2 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల మధుమేహం ఉన్నవారు సైతం దీన్ని ఆరగించవచ్చు.
అవకాడో: అవకాడలో ప్రొటీన్ అధికం. ఒక గిన్నె అవకాడో తింటే శరీరానికి 4 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. పోషక విలువలు ఎక్కువ. శరీరానికి తగిన బలం చేకూరుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి ఉపయోగపడతాయి. మెదడు కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి.
కివి పండు: కివి పండు అందరినీ ఆకర్షిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు. ఒక కివి పండు తినడంవల్ల 2.1 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇతర పోషకాలు కూడా ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం,మెగ్నీషియం,కాపర్,ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో రోజుమొత్తం సరిపడా విటమిన్ సి లభిస్తుంది.












Click it and Unblock the Notifications