బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి!
ప్రస్తుతం సమాజంలో ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. ఊబకాయం నుండి బయట పడాలి అనుకునేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అన్నం తినడం దాదాపుగా తగ్గిస్తే, బరువును కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్నానికి బదులుగా కడుపు నిండే విధంగా ఏం తినాలి అని ఆలోచించేవారు కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకునే శనగల సలాడ్ ను ఒకసారి ట్రై చేయండి.
సలాడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
శనగలు నానబెట్టి ఉడక పెట్టుకున్నవి- ఒక కప్పు
కీర దోసకాయ- ఒకటి
టమాటాలు- రెండు
క్యాప్సికం- ఒకటి
ఉల్లిపాయ- ఒకటి
డ్రెస్సింగ్ కోసం
బాదంపప్పు- నాలుగు
జీడిపప్పు- రెండు
ఫూల్ మఖానా - 10
గుమ్మడి గింజలు- 10
సన్ ఫ్లవర్ సీడ్స్ - 10
వెల్లుల్లిరెబ్బలు- 4
పచ్చిమిర్చి- ఒకటి
కొత్తిమీర, పుదీనా- కొద్దిగా
సాల్ట్- కొద్దిగా
మిరియాలపొడి- కొద్దిగా
ఆలివ్ ఆయిల్- ఒక స్పూను
నిమ్మరసం- కొద్దిగా

తయారీ విధానం
ముందుగా నానబెట్టుకున్న బాదంపప్పు, జీడిపప్పు, ఫూల్ ముఖాన, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ తోపాటు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సాల్ట్ మిరియాల పొడి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి డ్రెస్సింగ్ కోసం పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఈ పేస్టును మనం చనా సలాడ్ లో ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. మయనీస్ కి బదులుగా దీనిని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
ఇలా చేస్తే సూపర్ శనగల సలాడ్
ఈ పేస్టు తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, టమాటాలు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అందులోనే ఉడకబెట్టుకున్న శనగలను కూడా వేసి, తయారు చేసుకున్న పేస్టును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. కొద్దిసేపు దీనిని ఫ్రిజ్లో ఉంచి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
మీ కడుపు నిండుగా ఉండటమే కాకుండా నోటికి మంచి రుచి
ఈ సలాడ్ మీ ఆకలిని తీర్చడం మాత్రమే కాకుండా, రుచికి కూడా చాలా బాగుంటుంది. ఇది మీ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ, మధ్యాహ్నం లంచ్ లా కానీ తీసుకోవచ్చు. దీంతో మీ కడుపు నిండుగా ఉండటమే కాకుండా నోటికి మంచి రుచి కూడా దొరుకుతుంది.












Click it and Unblock the Notifications