వరుసగా 14 రోజులు పంచదార మానేస్తే.. ఊహించని ఫలితం..!!
చక్కెర మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రతీ ఇంటా దీనిని టీ నుండి స్వీట్ల వరకు ఉపయోగిస్తున్నారు. బెల్లం కన్నా పంచదారతో చేసే స్వీట్స్ ని ఇష్టంగా తినటం ఈ మధ్య కాలంలో పెరిగింది. అయితే మితిమీరిన చక్కెర వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ చక్కెర తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, 14 రోజుల పాటు అసలు చక్కెర ముట్టుకోకుండా ఉంటే శరీరంలో వచ్చే మార్పుల గురించి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
చక్కెర కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వినియోగంలో ఎలాంటి మార్పూ రాలేదు. చక్కెర ఎక్కువగా వినియోగించటం వలన ఆకలి, క్రేవింగ్స్, ఇన్సులిన్, లివర్ ఫ్యాట్ లాంటి ఎన్నో సమస్యలు మెల్లగా అంటుకుంటాయి. అయితే, చక్కెరకు దూరంగా ఉండ టం చెప్పినంత తేలిక కాదు. షుగర్ మానేయగానే ముందుగా క్రేవింగ్స్ పుడతాయి. దీంతోపాటు తలవొప్పి, అలసట, ఇరిటేషన్, మెదడు పనితీరు తగ్గడం వంటి సమస్యలూ పలకరిస్తాయి. ఎప్పుడెప్పుడు చక్కెరను నోట్లో వేసుకుందామా అనిపిస్తుంటుంది. అయితే, 14 రోజుల పాటు, చక్కెరను వాడటం మానేస్తే, దాని ఫలితాలు శరీరంలో చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. చక్కెర లేనప్పుడు, మన శరీరం రక్తంలో చక్కెర స్థాయిని మరింత నియంత్రించడం ప్రారంభి స్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చక్కెరను తొలగించడం చర్మం, జీర్ణక్రియపై సానుకూల ప్రభావాలను చూపు తుంది. చక్కెరను తీసుకోకపోవడం వల్ల శరీరం బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

శరీరంలోని చక్కెరను నియంత్రించక పోవడంతో తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం లేదా గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు అధిక రక్త చక్కెరతో బాధపడుతున్నట్లు సూచిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మనం చక్కెర వాడకాన్ని తగ్గించినప్పుడు, రక్తంలో చక్కెరను నియం త్రించవచ్చు. కూరగాయలు, బ్రెడ్, పప్పులతో సహా ప్రతి ఆహార పదార్ధం ద్వారా చక్కెర శరీరానికి సరఫరా అవుతుంది. పంచదార మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చక్కెర మానేయడం పెద్ద కష్టమేమీ కాదు. రోజంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పండ్లు పుషలంగా తినే అవకాశం ఉంది. చెక్కరతో చేసిన పదార్థాలకు మాత్రం దూరం పాటించాలి. ఈ పద్నాలుగు రోజులు సాఫ్ట్‌డ్రింక్స్, జ్యూస్‌లు, స్వీటెన్డ్ ఆల్కహాల్ లాంటి వాటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దీని ద్వారా శరీరంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు.
-
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!!












Click it and Unblock the Notifications