Health Tips: ఎండా కాలం ఈ పని చేయండి.. చల్లగా ఉంటారు..!
ఎండా కాలం పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండా కాలం పలు జాగ్రత్తలు, పలు రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకోవచ్చు. రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తీసుకుంటే తీసుకుంటే మంచిది. ఎండా కాలం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. అందుకే ఎండా కాలం ఎక్కువ నీరు తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ తింటే మంచింది.

పొటాషియం, మెగ్నీషియం
పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, విటమిన్-సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి. కెరోటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉంటాయి. ఒంటికి చలువ చేసే కీరదోసకాయి తినడం మంచిది. బీరకాయ, సోరకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉండే కూరగాయలను వంటల్లో ఉపయోగించాలి.

కాటన్ వస్త్రాలు
ఎండా కాలంలో ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సమ్మర్ లో జీన్స్ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి తగులుతుంది. అలాగే ఎండా కాలంలో రోజు రెండుసార్లు స్నానం చేస్తే మంచిది.

బిర్యానీలు
బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిది. పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు తినడం శరీరానికి చలువ చేస్తుంది. రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తింటే మంచిది.

నీళ్ల బాటిల్
ఆఫీస్ లకు వెళ్లే వారు ఉదయం 10 లోపు వెళ్లాలి. సాయంత్ర 4 గంటల తర్వాత రావాలి. అత్యవసరంగా బయటకు వెళ్తే క్యాప్ ధరించాలి. జీన్స్ లాంటివి కాకుండా పలుచటి దుస్తువులు ధరించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకెళ్లాలి. క్యాప్ పెట్టుకోవాలి. శీతాలపానీయాలు కాకుండా చెరుకు రసం, జ్యూసులు వంటి తాగాలి.












Click it and Unblock the Notifications