Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరోగ్యంగా ఉన్నా "సడన్​ హార్ట్​ ఎటాక్​" ఎందుకు వస్తుందో తెలుసా..?

ఇన్నాళ్లు 60 ఏళ్ల దాటిన వారికి హార్ట్ ఎటాక్ లు వచ్చేవి. అవి కూడా ఎక్కడో ఒకటి వినేవాళ్లం. కానీ ప్రస్తుతం పాతికేళ్ల పిల్లలకే గుండెపోటు వచ్చేస్తోంది. ఆరోగ్యంగా ఉన్నా కూడా సడెన్ హార్ట్ ఎటాక్ సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ సమస్య తీవ్రతరం అవుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో మారుతున్న జీవన శైలి, ఉరుకులు పరుగుల జీవితం,ఆహారపు అలవాట్లు, నిద్రలేమి కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

మన చుట్టూనే సరదాగా నవ్వుతూ, సంతోషంగా పనిచేసుకుంటూ, అందరితో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. ఇదే ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే సడన్ కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి జీవనశైలి మార్పులే కారణం కావచ్చనని నిపుణులు అంటున్నారు.

కొవిడ్ 19 వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావంతో మయోకార్డిటిస్ అనే గుండె కండరాల వాపు వల్ల హఠాత్తుగా గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని, కొవిడ్ 19 తర్వాత ఈ సమస్య ఎక్కువ అయినట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే రక్తనాళాల్లో పూడికలు గుండె పోటుకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పూడికల కారణంగా గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుందని, దీంతో హార్ట్​ ఎటాక్​ సంభవిస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. హార్ట్ ఎటాక్​ తో చనిపోతున్న వారిలో 50 శాతం మరణాలకు ఇదే కారణం అని చెబుతున్నారు.

Silent Killers Why Even Healthy People Face Sudden Heart Attacks

అలాగే గుండె లయ తప్పటం అంటే.. గుండె కొట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తోడ్పడుతుందని.. ఇది అస్తవ్యస్తమైతే గుండె కొట్టుకునే తీరు దెబ్బతింటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో గుండె చాలా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవచ్చని, కొన్ని సార్లు పూర్తిగా ఆగిపోవచ్చని చెబుతున్నారు. దీన్నే సడెన్ హార్ట్ ఎటాక్ అని వివరిస్తున్నారు. అంతేకాక తీవ్ర వ్యాయామంతో కూడా ఇలా జరగొచ్చని చెబుతున్నారు. ఇక అధిక కొవ్వు, మైదా పదార్థాలు, ధూమపానం, మద్యపానం గుండెకు మంచిది కాదని వైద్యులు వివరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+