ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం!
ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఇటీవల కాలంలో చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. చిరుధాన్యాలతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి ఈ చిరుధాన్యాల ఆహారం బాగా ఉపయోగపడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.
ఉపాసన చేసే రాగి జావా స్పెషల్
అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు ఇటీవల కాలంలో ఉపాసన కొణిదెల చేసే రాగి జావపైన ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది. చిరంజీవి కోడలు ఉపాసన క్లింకారాకు ప్రతిరోజు రాగిజావ పెడతానని, అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో రాగిజావ ని ఎలా తయారు చేయాలి. ఉపాసన స్టైల్ రాగి జావా ఎలా తయారు చేయాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి- రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు- రెండు కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
పెరుగు- అరకప్పు
ఉల్లిపాయ- ఒకటి సన్నగా తరిగిన ముక్కలు
పచ్చిమిర్చి -రెండు సన్నగా తరిగిన ముక్కలు
జీలకర్ర పొడి- పావు టీ స్పూన్
కొత్తిమీర తరుగు- కొద్దిగా
కరివేపాకు తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా రెండు కప్పుల నీళ్లను ఒక గిన్నెలో తీసుకొని మరిగించాలి . ఆపై ముప్పావు గ్లాసు నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని కలిపి మరిగే నీళ్లలో ఆ పిండిని పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కాస్త చిక్కబడిన తర్వాత గిన్నెను దింపి పక్కన పెట్టేయాలి. అరకప్పు పెరుగుని చిలికి కాసిన్ని నీళ్లు పోసి మజ్జిగలా చేయాలి. ఆ తర్వాత చల్లారిన రాగి మిశ్రమంలో ఆ పెరుగు నీటిని కలపాలి.
ఇలా చేసి తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్
అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కావాలంటే జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు కూడా వేసి, కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి తీసుకోవాలి. ఈ రాగి జావా ఎదిగే పిల్లల ఎముకలకు బలం చేకూరుస్తుంది. వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. రాగులలో ఉండే అనేక పోషకాలు ఎనీమియాను తగ్గిస్తాయి.
ఇంకెందుకాలస్యం రాగిజావ తీసుకోండి
రాగులలో ఉండే ప్రోబయోటిక్స్ తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇది గెట్ హెల్త్ కు కూడా చాలా మంచిది. రాగులలో క్యాలరీలు తక్కువగా ఉండడం బరువు పెరగకుండా చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగిజావను మీరు తయారు చేసుకుని ట్రై చేయండి.












Click it and Unblock the Notifications