ఈ వాకింగ్ రూల్ తెలుసా..? ఇలా చేస్తే గుండె జబ్బులు అస్సలు రావు..!
ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా గుండెపోటు బారిన పడుతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దాంతోపాటు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో గుండె జబ్బులను తగ్గించుకునేందుకు నడక మంచిదని వైద్యులు చెబుతున్నారు. జిమ్ ల కన్నా నడక అత్యంత విలువైన సాధనం అని వివరిస్తున్నారు. నడకతో పాటు చిన్నపాటి వ్యాయామాలు శరీరంలో భారీ మార్పులు తీసుకొస్తాయని చెబుతున్నారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న నడక పద్ధతి చాలా ఉపయోగకరమైనదని వైద్యులు వివరిస్తున్నారు. ఈ వ్యాయామం సులభమైనదని.. అలాగే సమర్థవంతమైన ఫిట్ నెస్ సీక్రెట్ అని చెబుతున్నారు. ఈ వ్యాయామం కారణంగా బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందని వివరిస్తున్నారు.

ఇక 6-6-6 నడక పద్ధతి అంటే.. 60 నిమిషాల నడక అనగా.. రోజులో ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాలు చురుకుగా నడవాలి. అలాగే 6 నిమిషాల వార్మ్-అప్ అంటే నడక ప్రారంభించే ముందు 6 నిమిషాల పాటు నెమ్మదిగా వార్మ్-అప్ చేయాలి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత 6 నిమిషాల కూల్-డౌన్ అనగా నడక ముగిసిన తర్వాత 6 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఇది గుండె వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ విధానాన్ని డెయిలీ పాటిస్తే గుండెజబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications