పాలకూరతో ఎగ్ కర్రీ ట్రై చేశారా..? సూపర్ టేస్టీ కాంబో..!
కోడి గుడ్డుతో వంటకాలు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఎగ్ ను ఫ్రై చేసుకున్నా.. ఉడకపెట్టినా.. ఆమ్లెట్ వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. మరి పాలకూరతో ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? పాలకూరతో ఎగ్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
పాలకూర కాంబినేషన్ లో ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కోడిగుడ్లు మూడు లేదా నాలుగు,టమాటాలు రెండు, ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు, పాలకూర మూడు లేదా నాలుగు కట్టలు, వెల్లుల్లి రెబ్బలు ఆరు, నూనె తగినంత, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, అల్లం కొద్దిగా, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, దాల్చినచెక్క కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, గరంమసాలా హాఫ్ టేబుల్ స్పూన్, సన్నని కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
పాలకూరతో ఎగ్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నెలో ఎగ్స్ ను ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికించుకునేలోపు పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పాలకూర వేసి అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అలాగే అల్లాన్ని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉడికించి చల్లార్చుకున్న పాలకూర, పచ్చి మిర్చి, అల్లం తరుగు, ధనియాల పొడి వేసుకుని మెత్తని పేస్ట్ మాదిరిగా గ్రైండింగ్ చేసుకోవాలి.

అనంతరం కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. అది వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త సాఫ్ట్ గా మారేవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలను వేసి మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పాలకూర ప్యూరీ, తగినంత ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు అందులో ఉడికించిన కోడిగుడ్డు ముక్కలను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. అలా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. పాలకూర కోడిగుడ్డ కర్రీ రెడీ అయినట్టే..
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications