రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ.. ఇలా చేస్తే సూపర్ గా వస్తాయి
సహజంగా దోశ, ఇడ్లీ వంటివి చేసుకోవాలంటే దానికి ముందుగానే పప్పు నానబెట్టి పిండి రెడీ చేసుకోవాలి. అయితే అటువంటివి అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా కూడా మనం దోశలు చేసుకోవచ్చు. ఇక ఇన్స్టెంట్ గా చేసుకునే రవ్వ దోశ సరైన విధానంలో చేస్తే చాలా బాగా వస్తుంది. ప్రస్తుతం మనం రెస్టారెంట్ స్టైల్ లో ఇన్స్టంట్ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
రవ్వ దోశ తయారీకి కావలసిన పదార్ధాలు
బొంబాయి రవ్వ- ఒక కప్పు
మైదా- అరకప్పు
బియ్యం పిండి- పావు కప్పు
ఉల్లిపాయలు-- సన్నగా తరిగినది ఒకటి
పచ్చిమిర్చి- సన్నగా తరిగినవి రెండు
అల్లం తురుము- ఒక స్పూను
పెరుగు- అరకప్పు
కరివేపాకు- కొద్దిగా
జీలకర్ర- ఒక టీ స్పూన్
మిరియాల పొడి- హాఫ్ టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె- దోస వేసుకోవడానికి కావలసినంత

తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రవ్వ, మైదాపిండి, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. అందులో పెరుగు వేసి ముద్దలు లేకుండా లూజ్ గా కలుపుకోవాలి. ఇందులో క్రమంగా నీరు పోసుకుంటూ పలుచని మజ్జిగ మాదిరిగా బ్యాటర్ ను తయారు చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
రవ్వ దోశ ఇలాగే వెయ్యాలి
ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని, పెనం వేడి అయిన తర్వాత దానికి నూనె రాయాలి. ఇక పిండిని కలుపుతూ పెనం మీద చల్లుతున్నట్లు గా పోయాలి. పిండి పోసేసి గరిటతో అస్సలు రుద్దకూడదు. అలా చేస్తే దోశ సరిగ్గా రాదు. పిండిని చల్లుతున్నట్లుగా పోస్తే అది చిన్న చిన్న గ్యాప్స్ తో ఒక దోశ లాగా ఫామ్ అవుతుంది.
రెస్టారెంట్లో ఇన్స్టంట్ రవ్వ దోసెను ఇలాగే చేస్తారు
దీని మధ్యలో కొద్దిగా నూనె వేసి మంట మధ్యస్థంగా పెట్టి క్రిస్పీగా కాలే వరకు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లతో సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటుంది. రెస్టారెంట్లో ఇన్స్టంట్ రవ్వ దోసెను ఇదేవిధంగా తయారుచేస్తారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కొలతలతో ఈ విధానంలో రవ్వ దోశ ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.












Click it and Unblock the Notifications