మలైకా అరోరా ఫిట్నెస్, బ్యూటీ వెనుక ఈ డిటాక్స్ డ్రింక్స్!
బాలీవుడ్లో మలైకా అరోరా ఫిట్నెస్ గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా చర్చిస్తారు. 52సంవత్సరాల మలైకా అరోరా ఇంకా సూపర్ ఫిట్నెస్ తో, చర్మం పైన ముడతలు లేకుండా బ్యూటీగా ఎలా కనిపిస్తున్నారు? అసలు మలైకా అరోరా ఏం చేస్తారు? అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు చాలా క్యూరియాసిటీ చూపిస్తారు. మలైకా అరోరా ప్రతిరోజు వ్యాయామం, యోగ చేయడంతో పాటు ఆహారం విషయంలో, తాగే డ్రింక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
డిటాక్స్ డ్రింక్ తోనే మలైకా అరోరా రోజు ప్రారంభం
ఈరోజు మనం మలైకా అరోరా తీసుకునే డిటాక్స్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.ప్రతిరోజు మలైకా అరోరా ఉదయం లేచిన వెంటనే డిటాక్స్ డ్రింక్ తోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే వామ్ వాటర్ విత్ లెమన్ హనీ తీసుకుంటారు. గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటారు.

మలైకా అరోరా ఫిట్ గానూ, అందంగానూ ఉండటం వెనుక ఈ డ్రింక్స్
ఇక రోజులో టర్మరిక్ డీటాక్స్ డ్రింక్ కూడా తీసుకుంటారు. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి కొంచెం తేనె కలిపి తాగుతారు. మలైకా అరోరా ఆపిల్ సైడర్ వెనిగర్ తో తయారుచేసిన డ్రింక్ కూడా డిటాక్స్ డ్రింకు గా తీసుకుంటారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటారు.
ఈ డిటాక్స్ డ్రింక్స్ తో అందం, ఆరోగ్యం
రోజంతా ఎక్కువ తాగే వాటి పైన శ్రద్ధ పెట్టే మలైకా అరోరా కీర దోసకాయ, పుదీనా ఆకులతో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ ను తాగుతారు. నీళ్లలో కీరా దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మ ముక్కలు వేసి కొద్ది గంటలసేపు ఇన్ఫ్యూజ్ చేసిన డ్రింక్ ను తాగుతారు. మలైకా అరోరా కలబంద, వీట్ గ్రాస్ తో తయారు చేసిన జ్యూస్ ను తాగుతారు.
టాక్సిన్స్ లేకుండా ఆమె తాగే పానీయాలివే
అప్పుడప్పుడు మలైకా అరోరా గ్రీన్ టీ లేదా మాచా టీని తాగుతారు. మన శరీరాన్ని టాక్సిన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంచేలా చేసే డిటాక్స్ డ్రింక్ లకు ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే మలైకా అరోరా 52 ఏళ్ళ వయసులో కూడా ఫిట్నెస్ తోను, బ్యూటీ గాను కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications